5 ఏళ్ళు బంగారం కొనుగోలు చేస్తాను, రెండింతలు కావొచ్చు: రాకేష్ ఝన్‌ఝన్‌వాలా
రాబోయే అయిదేళ్లలో తాను బంగారం, ఈక్విటీ మార్కెట్లలోనే ఇన్వెస్ట్ చేస్తానని ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝన్‌ఝన్ వాలా అన్నారు. బంగారం పరుగు ఖాయమని చెబుతున్నారు. బంగారం ధర గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ వస్తోంది. తగ్గుదల మాత్రం స్వల్పంగా ఉంది. గత నెల వరకు దాదాపు నెలన్నర వ్యవధిలో రూ.33 వేల నుంచి రూ.40వేలకు చేరుకుంది. ఇప్పుడు కూడా రూ.39వేలకు అటు ఇటుగా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయని, ఈ నేపథ్యంలో భవిష్యత్తులో బంగారం ధరలు భారీగా పెరగవచ్చునని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం భవిష్యత్తోలో ఔన్స్ 2,500 నుంచి రూ.3,000 డాలర్ల వరకు ఉండవచ్చునని చెప్పారు. ప్రస్తుతం బంగారం ఔన్స్ 1500 డాలర్లకు అటు ఇటుగా ఉంది. అంటే ప్రస్తుతం రూ.40వేలుగా ఉన్న బంగారం దాదాపు రూ.70 వేల నుంచి రూ.75 వేల వరకు వెళ్ళవచ్చు.

మార్కెట్ గురించి మాట్లాడుతూ.. మార్కెట్లు ఎలా స్పందిస్తాయో ఊహించడం కాస్త కష్టమేనని చెప్పారు. అంచనా వేసినప్పటికీ రిస్క్, మార్కెట్ పరిస్థితులు దేవుడికి మాత్రమే తెలుసునన్నారు. ఎవరికైనా నచ్చినా నచ్చకపోయినా మార్కెట్ అనేది వాతావరణ పరిస్థితుల వంటివి అన్నారు. నిత్యం మార్కెట్‌ను పరిశీలిస్తేనే తెలుసుకోగలమన్నారు. మార్కెట్ కింగ్స్‌గా భావించిన వారు కూడా ఆర్థర్ రోడ్డు జైలుకు వెళ్లారన్నారు.
నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చాక పన్ను రేటును తగ్గించారని, ఇన్వెస్టర్లకు ల్యాండ్స్ గుర్తించారని, ఇలాంటి ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు. బంగారం ధరలు రానున్న కాలంలో మరింతగా పెరుగుతాయన్నారు.


Click it and Unblock the Notifications