న్యూఢిల్లీ: దేశ ఆర్థికస్థితిగతులపై వినియోగదారుల విశ్వాసం సన్నగిల్లుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెప్టెంబర్ నెలలో నిర్వహించిన వినియోగదారుల విశ్వాస సర్వేలో ఇది వెల్లడైంది. ప్రస్తుతం దేశ ఆర్థికస్థితి, ఉద్యోగాలు, ధరలు, ఆదాయం, వ్యయాలపై ప్రజాభిప్రాయాలు తెలుసుకునేందుకు ఆర్బీఐ దేశంలోని 13 నగరాల్లో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 4,192 కుటుంబాల ద్వారా వివరాలు తీసుకుంది.

అందుకే వ్యయం పెరుగుతోంది...
గత జూలై నాటి పరిస్థితులతో పోలిస్తే సెప్టెంబర్ నాటికి వినియోగదారుల్లో విశ్వాసం చాలామటుకు సన్నగిల్లింది. భవిష్యత్తు ఆదాయాల పెరుగుదలపై వారు పెద్దగా ఆశలు కూడా పెట్టుకోలేదు. గత ఏడాది కాలంతో పోలిస్తే ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినట్లు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో మరింత పెరుగుతాయని చెప్పారు. ఇలాంటి కారణాలతో వ్యయం పెరిగినట్లు తెలిపారు. సర్వే నిర్వహించిన నగరాల్లో హైదరాబాద్ కూడా ఉంది.

2014లో మోడీ ప్రధాని అయ్యాక అత్యల్పం ఇదే
2008 ఆర్థిక సంక్షోభం తర్వాత మళ్లీ ప్రస్తుత సెప్టెంబర్ నెలలోనే బిజినెస్ క్లైమేట్ దారుణంగా ఉందని అభిప్రాయపడ్డారు. కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ (CCI) గత త్రైమాసికంలో 95.7 నుంచి 89.4 శాతానికి పడిపోయింది. 2014లో నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత కనిష్టం ఇదే కావడం గమనార్హం. యూపీఏ 2 హయాంలో 2013 సెప్టెంబర్ నెలలో ఈ ఇండెక్స్ 88గా ఉంది. అంటే మోడీ హయాంలో కంటే కాంగ్రెస్ హయాంలో విశ్వాస సూచీ చాలా తక్కువగా ఉంది. కానీ మోడీ అధికారంలోకి వచ్చాక మాత్రం ఇది అత్యల్పం.

సర్వేలో పాల్గొన్నవారు ఏం చెప్పారంటే...
సర్వేలో పాల్గొన్నవారిలో శాతం మంది సాధారణ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని, 33.5 శాతం మంది మాత్రం మెరుగుపడిందన్నారు. ప్రస్తుత పరిస్థితిని ఏడాది కాలంలోనే అధిగమిస్తామని 53 శాతం మంది చెప్పారు. అయితే మూడు నెలల్లో ఈ సంఖ్య 6 శాతం మేర తగ్గింది.

ధరలు పెరుగుతున్నాయి...
ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయని సగంమంది చెప్పగా, ఈ ఏడాది మెరుగుపడుతుందని కూడా చెప్పారు. ఇప్పటికే ధరలు పెరిగాయని, రాబోవు కాలంలో మరింత పెరుగుతాయని చెప్పారు.

మోడీ హయాంలో 100లోపు, 100కు పైగా ఇండెక్స్
2013 సెప్టెంబర్ నెలలో ఇండెక్స్ 88గా ఉండగా, 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన సెప్టెంబర్ నెలలో ఇది 103.1గా ఉంది. 2016 నవంబర్ నెలలో నోట్ల రద్దు అనంతరం కూడా ఆ తర్వాత నెల డిసెంబర్‌లో ఇది 102గా ఉంది. ఇండెక్స్ 100కు పైగా ఉంటే సానుకూలం. ఆ తర్వాత కొంతకాలం 100కు తగ్గింది. 2019 ఎన్నికల సమయంలోను అంటే మార్చిలో ఈ ఇండెక్స్ 104.6 గా ఉంది. 2016 డిసెంబర్ తర్వాత 2019 మార్చిలోనే ఇండెక్స్ 100 దాటింది.

ఫ్యూచర్ ఇండెక్స్
సార్వత్రిక ఎన్నికల అనంతరం 2019 మే నెలలో సీసీఐ ఇండెక్స్ 97.3 శాతానికి పడిపోయింది. సెప్టెంబర్ నెలలో 89.4 శాతానికి తగ్గింది. అదే సమయంలో భవిష్యత్తు అంచనా విషయానికి వస్తే 2019 జూలైలో 124.8గా ఉంటే, సెప్టెంబర్‌లో 6 తగ్గి 118గా ఉంది.

జూలై, సెప్టెంబర్ నెలల్లో కన్స్యూమర్ విశ్వాసం ఇలా...
ఈ ఏడాది జూలై, సెప్టెంబర్ నెలల్లో కన్స్యూమర్ విశ్వాసం వరుసగా ఇలా ఉంది... ఆర్థిక పరిస్థితి జూలైలో -1.0, సెప్టెంబర్‌లో -14.4, ఉద్యోగాలు -13.1, -24.5, ధరలస్థాయి -78.8, -82.8గా ఉన్నాయి.
ఆదాయం జూలైలో 2.9, సెప్టెంబర్‌లో -1.7, వ్యయం 68.8, 70.3గా ఉంది. వినియోగదారుల విశ్వాస సూచి జూలైలో 95.7, సెప్టెంబర్‌లో 89.4గా ఉంది.
More From GoodReturns

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications