దేశంలోని వాణిజ్యరంగం 2008 ఆర్థిక సంక్షోభమం సమయంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సర్వేలో తేలింది. ఆర్బీఐ త్రైమాసిక సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఆర్థిక మందగమనం తీవ్రతను ఈ సర్వే తెలియజేస్తోంది. గత నెల ప్రభుత్వం కార్పోరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం కూడా ఈ కారణంతోనే తీసుకుంది.
ముఖ్యంగా తయారీ సంస్థల ఆర్డర్లు 23 శాతం మేరతగ్గిపోయాయి. 2008 తర్వాత ఇది అత్యల్పం. ఇటీవల ఆర్థిక వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్టానికి 5 శాతానికి చేరుకుంది. ఈ ప్రభావం మిగిలిన వాటిపై పడింది. దీంతో ఉత్పాదక సామర్థ్యం కూడా గత త్రైమాసికంలో 76.1 శాతం ఉండగా, అది ఈ త్రైమాసికానికి 73.6 శాతానికి తగ్గింది.

వివిధ వర్గాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత రెండో త్రైమాసికంలో ఆర్డర్స్, ఉత్పత్తి, ఉద్యోగ రేటులో తగ్గుదల ఉందని తేలిందని, ఎగుమతులు, దిగుమతులపై అంచనాలు నిరాశపరుస్తున్నాయని ఇండస్ట్రియల్ సర్వే తెలిపింది. ఇవే అభిప్రాయాలను కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వేలో తేలాయి.
ఇటీవల ఆటో సేల్స్ భారీగా పడిపోయిన విషయం తెలిసిందే. ఎఫ్ఎంసీజీ కూడా మందగమనంలో కొనసాగుతోంది. రియల్ ఎస్టేట్ రంగం ఆశించిన మేర లేకుండా పోయింది. ముఖ్యంగా ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాల వల్ల చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. 2008 తర్వాత వచ్చిన పెద్ద ఆర్థిక సంక్షోభం ఇదేనని చాలామంది ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications