హైదరాబాద్‌లో ఐటీ ట్రెండ్ మారుతోంది. ముఖ్యంగా మల్టీ నేషనల్ కంపెనీలు.. బెంగళూరు కన్నా హైదరాబాద్ పట్ల అత్యంత మక్కువ చూపుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో ఉన్న ఎమ్మెన్సీలు తమ ఆర్ అండ్ డీ కేంద్రాలను మరింత విస్తరిస్తుండగా.. కొత్త కంపెనీలు కూడా ఇక్కడ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్(జీఐసీ)ల ప్రారంభానికి ఆసక్తి చూపుతున్నాయి.
గత రెండు మూడేళ్లుగా ఈ ధోరణి బాగా పుంజుకుంది. గతంలో అమెరికాకు చెందిన బీమా సేవల సంస్థ చెబ్.. హైదరాబాద్‌లో పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించగా.. ఆ తరువాత కాలిఫోర్నియాకు చెందిన ఐటీ కన్సల్టింగ్ సేవల కంపెనీ న్యూడెసిక్ కూడా కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లో తన రెండో జీఐసీని ప్రారంభించింది.
ఇప్పటికే అమెజాన్, పెప్సీకో, జేడీ స్పోర్ట్స్ తదితర కంపెనీలు హైదరాబాద్‌లో తమ జీఐసీలను ఏర్పాటు చేయగా.. మరో మూడు నాలుగు రోజుల్లో ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద సెమీ కండక్టర్ కంపెనీ అయిన మైక్రాన్ టెక్నాలజీ కూడా ఇక్కడ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించబోతోంది.

హైదరాబాద్‌లోనే ఎందుకంటే...?
జీఐసీల ఏర్పాటుకు తొలుత అన్ని ఎమ్మెన్సీలు బెంగళూరునే ఎంచుకునేవి. కానీ గత మూడు నాలుగేళ్లలో చూసుకుంటే అక్కడ వేగం తగ్గింది. ఇప్పుడు వీటి దృష్టి హైదరాబాద్‌పై పడింది. హైదరాబాద్‌లో వాతావరణం, సంస్కృతి ఐటీ కంపెనీలకు అత్యంత అనుకూలంగా ఉంది. సానుకూల ప్రభుత్వ విధానాలు, మౌలిక సదుపాయాల కల్పనకు వ్యయం తక్కువ, నిపుణుల లభ్యత పెరగడం.. బెంగళూరుతో పోల్చుకుంటే హైదరాబాద్‌లో నిపుణులు తక్కువ వ్యయానికే లభిస్తుండడం.. ఇలాంటి అంశాలన్నీ ఎమ్మెన్సీలను అమితంగా ఆకర్షిస్తున్నాయి.

నిపుణుల వలసలూ తక్కువే...
ఇక ఐటీ కంపెనీలకు ఎదురయ్యే ప్రధాన సమస్య నిపుణుల వలస. పక్క కంపెనీ ఉద్యోగులను లాగేసుకునే సంస్కృతి హైదరాబాద్‌లో చాలా తక్కువ. బెంగళూరులో ఈ నిపుణుల వలసల రేటు 12-13 శాతం ఉండగా, హైదరాబాద్‌లో ఇది 3-4 శాతం మాత్రమే ఉంది. పైగా డిజిటల్ టెక్నాలజీ, అనలిటికల్ విభాగాల్లో సమర్థులైన నిపుణులు హైదరాబాద్‌లో లభిస్తుండడం కూడా ఒక ప్లస్ పాయింట్ అయింది.

డేటా కీలకం అవడంతో...
ఇప్పటి వరకు పలు ఎమ్మెన్సీ కంపెనీలు తమకు అవసరమైన సేవలు పొందేందుకు ఔట్ సోర్సింగ్ పద్ధతిని అనుసరించేవి. అయితే ప్రస్తుతం డేటా అనేది అత్యంత కీలకంగా మారింది. మేధో సంపత్తి సమాచారం బయటికి పొక్కకూడదనే ఉద్దేశంతో ఔట్ సోర్సింగ్ పద్ధతికి స్వస్తి పలికిన చాలా ఎమ్మెన్సీలు.. సొంతంగా ఆర్ అండ్ డీ కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలో నైపుణ్యం కలిగిన వారిని 20-30 శాతం అధిక వేతనం ఇచ్చి మరీ నియమించుకుంటున్నాయి.

జీఐసీలతో ఉద్యోగాలు, లాభాలు...
తమ కంపెనీ ఆధ్వర్యంలోనే జీఐసీ ఏర్పాటు కావడం వల్ల.. వ్యయం తగ్గడమేకాక, నిపుణులు కూడా ఎల్లప్పుడూ తమకు అందుబాటులో ఉంటారన్న భావనతోనే పలు ఎమ్మెన్సీలు ఈ జీఐసీల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. పైగా ఈ జీఐసీలకు ఎక్కువ మంది ఉద్యోగుల అవసరం కూడా ఉండదు. కొన్ని టెక్నాలజీల్లో నిపుణులు ఉన్నా సరిపోతుంది. పైగా బెంగళూరుతో పోల్చుకుంటే వీరు కాస్త తక్కువ వేతనాలకే లభిస్తున్నారు.

45 శాతం జీఐసీలు భారత్‌లోనే...
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జీఐసీల్లో దాదాపు 45 శాతం ఇప్పుడు ఒక్క భారత దేశంలోనే ఉన్నాయంటే ఇక్కడ వీటి ఏర్పాటుకు ఎమ్మెన్సీలు ఎంత ఉత్సాహం చూపిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1100 జీఐసీల్లో దాదాపు 8 లక్షల మందికిపైగా ఉద్యోగులు పని చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత ఐదేళ్లలో హైదరాబాద్‌లో 25 జీఐసీలు ఏర్పాటు అయ్యాయి. వీటి ద్వారా ఇక్కడ 10 వేల మందికి పైగా నిపుణులకు ఉద్యోగాలు లభించాయి.

ఏడాదికి లక్ష కొత్త ఉద్యోగాలు...
గత కొన్నేళ్లుగా ఔట్ సోర్సింగ్ సేవల్లో 35-40 శాతం.. ఎమ్మెన్సీలు ఏర్పాటు చేసిన జీఐసీలకే లభించాయి. ప్రస్తుతం ఇవి లక్షన్నర కోట్లకుపైగా ఆదాయన్ని ఆర్జిస్తున్నాయి. అలాగే రాబోయే ఐదేళ్లలో హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగాల సంఖ్య కూడా భారీగా పెరగనుంది. గత ఏడాది హైదరాబాద్‌లో 68 వేల ఐటీ ఉద్యోగాలు రాతగా.. ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరగనుంది. కొత్తగా ఏర్పాటయ్యే ఆర్ అండ్ డీ కేంద్రాల్లో మూడింట రెండు వంతులు జీఐసీలే ఉంటాయని అంటున్నారు. ఈ లెక్కన 100 చదరపు అడుగులకు ఒక ఉద్యోగం అనుకుంటే.. రాబోయే రోజుల్లో ఏడాదికి లక్షకు పైగా కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
More From GoodReturns

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications