గోల్డ్ బాండ్ ధర రూ.3,788, ఆన్‌లైన్ ద్వారా రూ.3,738కే
ఈ నెల 7వ తేదీ నుంచి సార్వభౌమ పసిడి బాండ్లు పథకం (సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్) వచ్చే దశ (అక్టోబర్ నుంచి డిసెంబర్)కు గాను గ్రాము ధరను రూ.3,788 గా నిర్ణయించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. సార్వభౌమ పసిడి బాండ్ల పథకం 2019-20 సిరీస్ 5 ఈ నెల 7వ తేదీన ప్రారంభమై 11వ తేదీన ముగుస్తుంది. వచ్చే సోమవారం దరఖాస్తులు స్వీకరిస్తారు.
ఆన్‌లైన్‌లో బాండ్ల దరఖాస్తు, చెల్లింపు చేస్తే గ్రాముపై రూ.50 రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. అంటే వీరికి రూ.3,738కే గ్రాము బాండ్ అందుబాటులో ఉంటుంది. భౌతికంగా పసిడి గిరాకీ తగ్గించేందుకు సార్వభౌమ పసిడి బాండ్ల పథకాన్ని 2015 నవంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.

వ్యక్తిగతంగా ఒకరు ఒక ఆర్థిక సంవత్సరంలో 500 గ్రాముల వరకు విలువైన పసిడి బాండ్స్‌ను కొనుగోలు చేయవచ్చు. హిందూ అవిభక్త కుటుంబం నాలుగు కేజీల వరకు కొనుగోలు చేసే అవకాశముంద. ట్రస్టీలకు 20 కిలోల వరకు కొనుగోలు చేయవచ్చు.
ఈ నెలగ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు (2019-20 సిరీస్ 5) తర్వాత మళ్లీ అక్టోబర్ 21 నుంచి 25 వరకు (2019-20 సిరీస్ 6) విక్రయాలు ఉన్నాయి. దసరా, దీపావళి, ధన్‌తెరాస్ సందర్భంగా బంగారం విక్రయాలు భారీగా ఉంటాయని భావిస్తున్నారు.
గోల్డ్ బాండ్స్ ఇస్యూయెన్స్ డేట్ ఆర్ సబ్‌స్క్రిప్షన్ డేట్/ఇష్యూ డేట్
2019-20 సిరీస్ V అక్టోబర్ 7-11/అక్టోబర్ 15
2019-20 సిరీస్ VI అక్టోబర్ 21-25/అక్టోబర్ 30
2019-20 సిరీస్ VII డిసెంబర్ 2-6/డిసెంబర్ 10
2019-20 సిరీస్ VIII జనవరి 13-17/జనవరి 21
2019-20 సిరీస్ IX ఫిబ్రవరి 03-07/ఫిబ్రవరి 11
2019-20 సిరీస్ X మార్చి 02-06/మార్చి 11


Click it and Unblock the Notifications