సినేజెర్స్ : ఇండియాలో నయా కొనుగోలుదారులు! అందుబాటులో లక్షల కోట్ల మార్కెట్

సీనేజెర్స్. ఈ పదం ఎప్పుడైనా విన్నారా? లేదు కదా. ఎందుకంటే ఇది ఇటీవలే పురుడు పోసుకోండి కాబట్టి ఎవరూ దీని గురించి విని ఉండరు. దీని అర్థం - సీనియర్ సిటిజెన్ + టీనేజర్స్ = (సీనేజెర్స్). ఎందుకిలా అంటున్నారు అంటే, ఒక వ్యక్తి 60 సంవత్సరాలు దాటిన తర్వాత అచ్ఛం టీనేజేర్ లా ఆలోచిస్తాడట. చేసే పనుల్లోనూ, హావా భావాలూ, చివరికి డ్రెస్సింగ్ లోనూ టీనేజర్స్ లాగే ఉండేందుకు ప్రత్నిస్తారట.

ఈ విషయం కాస్త అటు ఇటుగా మనకు తెలిసిందే. కానీ వీరిని సరికొత్తగా సీనేజెర్స్ అని పిలుస్తుండటమే కొత్తగా ఉంది. దీనికీ సరైన కారణం ఉందండోయ్. అదేంటంటే... సీనేజెర్స్ ప్రస్తుతం కేవలం రిటైర్మెంట్ కోసం ఎదురు చూడటం లేదు. ఇంకా పని చేస్తున్నారు. అలాగే భారీగా ఖర్చు పెడుతున్నారు. ఆస్తులు కొంటున్నారు. షాపింగ్ చేస్తున్నారు. విదేశాలు చుట్టి వస్తున్నారు. ఈ ట్రెండ్ భారత్ లో ఇప్పుడిప్పుడే మొదలైందని, త్వరలోనే ఇది మరింతగా పెరుగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

 New consuming class: Teenagers over 60 years

మెరుగైన ఆయుష్షు...
గతంతో పోల్చితే మన దేశంలో ఆరోగ్య సేవల రంగం బాగా అభివృద్ధి చెందిందు. ఒకప్పుడు గుండె జబ్బు వస్తేనే ప్రాణం మీదికి వచ్చేది. ఇప్పుడేమో కాన్సర్ వచ్చినా మళ్ళీ మునుపటి మనిషిలా బతికేస్తున్నారు. పౌరుల సగటు జీవన కాలం కూడా గణనీయంగా పెరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ ప్రకారం ... భారత్ లో సగటు ఆయుర్ధాయం 68.8 సంవత్సరాలు. పురుషుల సగటు జీవన కాలం 67.4 సంవత్సరాలు కాగా, మహిళల సగటు జీవన కాలం 70.3 సంవత్సరాలుగా ఉంది. 1980 లో ఇదే సగటు జీవన కాలం కేవలం 58.84 సంవత్సరాలు కావటం గమనార్హం. కాబట్టి సీనియర్ సిటిజన్స్ ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. దీంతో వారు గతం లో అనుకొని చేయలేక పోయిన పనులను రిటైర్మెంట్ తర్వాత పూర్తిచేస్తున్నారు.

సేవింగ్స్ లో దిట్టలు...
ఎన్ని బరువు బాధ్యతలు మోసినప్పటికీ... సీనేజెర్స్ పొదుపు శాతం మొత్తం దేశ పొదుపులో నాలుగో వంతు ఉండటమే వీరి శక్తికి నిదర్శనం. పిల్లల చదువులు, పెండ్లిళ్లు వంటి బాధ్యతలను నెరవేరుస్తూనే మరో వైపు కొంత మొత్తాన్ని పొదుపు రూపంలో జమ చేస్తున్నారు. ఉద్యోగులైతే పెన్షన్ కూడా వస్తుంది కాబట్టి పొదుపునకు అది జోడై మరింత అధిక నెల వారి సంపాదన కనిపిస్తోంది. ఎల్ఐసి పాలసీల వల్ల పెద్ద మొత్తంలో నగదు చేతికి అందివస్తోంది. దీంతో సీనేజెర్స్ పెట్టుబడులు పెడుతున్నారు. అదే సమయంలో సగటు యువకుడికంటే కూడా అధికంగా పొదుపు చేయటం తో పాటు ఖర్చు కూడా చేయగలుగుతున్నారు.

దేశాలు చుట్టేస్తున్నారు...
ఒకప్పుడు సీనేజెర్స్ రిటైర్మెంట్ తర్వాత చేతిలో ఒక పేపర్, మరో చేతిలో టీ కప్పుతో కనిపించే వారు. రామ-కృష్ణ అంటూ మహా అయితే ఏ కాశి కో మరో టెంపుల్ కో వెళ్లే వారు. కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. విదేశీ పర్యటనలు చేస్తున్నారు. అది కూడా సహా ధర్మ చారిణితో. షాపింగ్ కోసం లావిష్ గా ఖర్చు చేస్తున్నారు. నాకు ఎప్పటి నుంచో సింగపూర్, మలేషియా దేశాలు చూడాలని కోరిక. కానీ ఉద్యోగరీత్యా, పిల్లల చదువులు, పెండ్లిళ్ల వల్ల కుదరలేదు. కానీ ఇటీవలే ఆ కోరిక తీర్చుకొన్న అని స్కూల్ హెడ్ మాస్టరుగా రిటైర్ ఐన ఒక సీనేజెర్ తెలిపారు. అతని పెన్షన్, వాళ్ళ ఆవిడ శాలరీ కలిపి నెలకు రూ 1 లక్ష కంటే ఎక్కువ సంపాదన ఉంటుందని, ఇటీవలే కట్టించిన ఇంటి నుంచి నెలకు రూ 20,000 ఆదాయం అద్దెల రూపంలో లభిస్తోందని చాలా ఆనందంగా చెప్పాడు. అదే సమయంలో కొడుకుల కోసం చిన్న చిన్న పెట్టుబడులు కూడా పెడుతున్నారు. వారి కోసం సొంత సమయం కేటాయించుకొంటున్నారు.

రూ 3 లక్షల కోట్లకు పైగా...
భారత్ లో సీనేజెర్స్ మార్కెట్ పై స్పష్టమైన అంచనాలు ఏమి లేవు. కానీ వారి వినియోగ సరళిని బట్టి మన దేశంలో సుమారు రూ 3,00,000 కోట్ల మార్కెట్ ఉందని ప్రైవేట్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అందులో ప్రస్తుతం కేవలం 10% మాత్రమే టాప్ చేయగలుగుతున్నామని, వచ్చే 5-10 ఏళ్లలో 50% నుంచి 75% వరకు మార్కెట్ ను వినియోగించుకొనే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అదే జరిగితే, భారత్ ప్రపంచంలోనే అత్యంత అధిక వినియోగం కలిగిన సీనేజేర్స్ ఉన్న దేశంగా నిలుస్తుందని వారు పేర్కొంటున్నారు. రిటైర్మెంట్ తర్వాత కూడా వారు కన్సల్టెంట్ లుగా పనిచేస్తుండటం వల్ల మెరుగైన సంపదను సృష్టించ గలుగుతున్నారు. దానిని సరిగ్గా పొదుపు చేయటం, పెట్టుబడులుగా మార్చటం, ఖర్చు చేయటం చేస్తున్నారు. అందుకే, ఇటీవల కొన్ని కంపెనీలు కేవలం సీనేజెర్స్ కోసమే ప్రత్యేక ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+