దసరా, దీపావళి పండుగ సీజన్‌లో కొనుగోళ్లపై ఆఫర్లు, ప్రభుత్వ, ప్రైవేటురంగ ఉద్యోగులకు బహుమతులు తెలిసిందే. అయితే 14 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులకు కూడా అదిరిపోయే పండుగ గిఫ్ట్ అందనుందట. ఐబీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వీజీ కన్నన్ లేఖ ప్రకారం అందరు బ్యాంకు ఉద్యోగులు దీపావళి పర్వదినం సందర్భంగా ఈ బహుమతి అందుకోనున్నారు.
ఉద్యోగులకు ఒక నెల వేతనాన్ని అడ్వాన్సు కింద ఇవ్వాలని ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ) ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు, విదేశఈ బ్యాంకుల హెడ్స్‌ను కోరింది. బేసిక్ శాలరీ, డియర్‌నెస్ అలవెన్స్ (DA) మొత్తం బ్యాంకు ఉద్యోగులకు అడ్వాన్సు శాలరీ రూపంలో అందనుంది. రెగ్యులర్ ఉద్యోగులు, స్టాఫ్, ఆఫీసర్స్‌కు ఈ ఫెస్టివెల్ అడ్వాన్స్ అందనుంది. దీపావళి పండుగకు ముందే ఉద్యోగులకు ఈ మొత్తాన్ని అందించనున్నారు.

నవంబర్ 1, 2017 నుంచి రోల్స్‌లో ఉన్న వారికి ఈ అడ్వాన్స్ రానుంది. అయితే ఆ తర్వాత అంటే నవంబర్ 1, 2017 నుంచి మార్చి 31, 2019 మధ్య చేరిన ఉద్యోగులకు మాత్రం పండుగ అడ్వాన్స్‌గా వేతనంలో సగం వస్తుంది.
పండుగ సందర్భంగా అడ్వాన్స్ రూపంలో తీసుకున్న వేతనాన్ని బ్యాంకులు ఎరియర్స్‌లో సవరిస్తాయి. తద్వారా వేతన సవరణ సమయంలో ఈ అడ్వాన్స్ మొత్తాన్ని సర్దుబాటు చేస్తాయి. బ్యాంకర్ల మనోధైర్యాన్ని పెంచేందుకు అడ్వాన్స్ ఇవ్వాలని సిఫార్సు చేసినట్లు ఐబీఏ పేర్కొంది. దీనిని అడోక్ పేమెంట్‌గా చెబుతారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications