భారత్ రియాల్టీ తీరు మారుతోందని, విద్యార్థుల నివాసాలు, వృద్ధుల ఆవాసాలు, కో-లివింగ్ నివాస సముదాయాలు, రెంట్ కోసం నిర్మించే సముదాయాలకు గిరాకీ ఉందని హెచ్‌డీఎఫ్‌సీ చీఫ్ దీపక్ పరేఖ్ అన్నారు. మార్కెట్ అవసరాల్ని ముందే గ్రహించి సరైన ధర, సరైన పరిమాణ ప్రాజెక్టులు చేపట్టే సరైన డెవలపర్లు ఉన్నంత వరకు రియల్ ఎస్టేట్ రంగం బాగా పని చేస్తుందన్నారు. ఇప్పుడు రియల్ రంగ అభివృద్ధికి ఎలాంటి ఢోకా లేదన్నారు. ఇది వృద్ధి చెందుతూనే ఉంటుందన్నారు.

విద్యార్థులకు సదుపాయాల కోసం...
సరైన వాణిజ్య సముదాయాల్లో విదేశీయులు కూడా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నారని దీపక్ పరేఖ్ చెప్పారు. ఫుడ్, నిత్యావసర గోడౌన్లపై, డేటా కేంద్రాలపై ఆసక్తిగా ఉన్నారన్నారు. అదే సమయంలో నివాస సముదాయాల విషయంలోనూ ఆసక్తితో ఉన్నారన్నారు. విద్యార్థులకు నివాస సముదాయాల్లో మంచి వృద్ధి ఉందన్నారు. యూనివర్సిటీలు, కాలేజీలు, అనేక విద్యాసంస్థల నిర్వాహకులు మరిన్ని తరగతి గదులు, ఇతర సదుపాయాలు కల్పించేందుకు సొంత నివాసాలు విక్రయిస్తున్నారని, ఈ విభాగంలో ఎంతో వృద్ధి ఉందన్నారు.

సహజీవన అద్దె గదులకు భారీ డిమాండ్
అద్దెకు ఇవ్వడం కోసమే, ముఖ్యంగా వృత్తి నిపుణులు, ఉన్నత విద్యాభ్యాసం చేసేవారు, సీనియర్ సిటిజన్ల వంటి వాటి కోసం నిర్మించే నివాస సముదాయాలపై విదేశీ పెట్టుబడిదారులు ఆశక్తిగా ఉన్నారని దీపక్ పరేఖ్ చెప్పారు. ఒకే రూం లేదా ఇంట్లో ఇద్దరు ముగ్గురు కలిసి ఉండే కో-లివింగ్ స్పేస్‌ను రియల్టీ రంగానికి బంగారు గని అని అభివర్ణించారు. విద్యార్థులు, వృత్తి నిపుణుల నుంచి ఈ తరహా నివాసాలకు డిమాండ్ పెరుగుతోందన్నారు.

రూ.6.6 లక్షల కోట్ల వ్యాపార అవకాశాలు
సమీప భవిష్యత్తులో ఈ విభాగంలోనే ఏటా 93 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.6.6 లక్షల కోట్ల వ్యాపార అవకాశాలు ఉన్నాయని అంచనా. వృద్ధులే కొంతమంది కలిసి నిర్మించుకుంటున్న నిర్మాణాలకు హెచ్‌డీఎఫ్‌సీ రుణాలు ఇస్తున్నట్లు పరేఖ్ చెప్పారు. ఇప్పుడు దేశంలో లివింగ్ స్పేస్‌లో 4.63లక్షల పడకలకు డిమాండ్ ఉందని, అందులో 89 లక్షల పడకలు స్టూడెంట్స్‌కు అవసరమవుతున్నాయని, ఈ స్థాయిలో డిమాండ్ ఉన్నా, రియల్టీ కంపెనీలేవీ పెద్దగా కో-లివింగ్ స్పేస్ పైన దృష్టి పెట్టడం లేదన్నారు. సంఘటిత సంస్థల నుంచి ప్రస్తుతం లక్ష కో-లివింగ్ బెడ్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు.

ఒక్కో పడకపై రూ.1.44 లక్షల లాభం
ఒక్కో పడకపై ఏడాదికి రూ.1.44 లక్షల చొప్పున సుమారు రూ.1440 కోట్ల ఆదాయం వస్తోందని అధ్యయనంలో తేలిందని పరేఖ్ అన్నారు. విద్యార్థులతో కలిసి ఈ విభాగంలో 4.63 కోట్ల పడకలకు డిమాండ్ ఉందన్నారు.

కో-లివ్, రెంటల్ వ్యాపారం కోసం నిధుల సమీకరణ
ఈ విభాగంలో ఇప్పటికే RentMyStay, Rentroomi, SimplyGuest, Flathood ఈ విభాగంలో కీలకంగా ఉన్నాయి. NestAway, Stanza Living, Zolo, Placio, CoLiveలు ఇటీవలే ఈ సెక్టార్‌లోకి అడుగు పెట్టాయి. తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు నిధులు సమీకరించాయి.

42 శాతం అధికం..
ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ప్రకారం.. కో-వర్కింగ్ ఆపరేటర్లు 2019 తొలి అర్ధభాగంలో 8 ప్రధాన నగరాల్లో 4 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. ఇది 2018 తొలి అర్ధ సంవత్సరంతో పోలిస్తే 42 శాతం అధికం. విదేశీ పెట్టుబడుదారులతో పాటు ప్రైవేటు ఈక్విటీ ప్లేయర్లు కూడా రెసిడెన్షియల్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారా అని అడిగితే... వారు వాణిజ్య ప్రాజెక్టులు, మాల్స్ మొదలైన వాటిపై ఆసక్తితో ఉన్నారని, జాయింట్ వెంచర్లలోకి వస్తున్నారని పరేఖ్ చెప్పారు.

రిటైర్మెంట్ హోమ్స్‌కు డిమాండ్
2050 నాటికి దేశంలో సీనియర్ సిటిజన్ల సంఖ్య 24 కోట్లకు చేరుకుంటుందని, వీరి కోసం ప్రత్యేక సముదాయాలు ఎలా నిర్మించాలో గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల సాఖ వెల్లడించింది. హాస్టళ్ల తరహాలో నిర్మించే వీటిలో వైద్య సదుపాయం కూడా ఉంటాయి. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, పుణే ప్రాంతాల్లో ఇలాంటివి పెరుగుతున్నాయి. వైద్యం, భద్రత, మౌలిక వసతులు, రోజువారీ నిర్వహణ వంటివి హౌస్ కీపర్ బాధ్యత చేపడతారని తెలిపారు. రిటైర్మెంట్ హోమ్స్‌కు డిమాండ్ క్రమంగా పెరుగుతోందన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications