భారత ఆర్థిక వ్యవస్థ ను పూర్తిస్థాయి మాంద్యం లోకి జారుకోకుండా చూడటం లో భాగంగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరిన్ని చర్యలకు ఉపక్రమించనుంది. ఇందులో భాగంగా వడ్డీ రేట్లను మరింత తగ్గించే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు రేపు (శుక్రవారం) జరగబోయే పరపతి సమీక్ష సమావేశంలో నిర్ణయం వెలువరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు మార్లు కీలక వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్బీఐ ... మరో మారు పావు శాతం (0.25%) మేరకు తప్పనిసరిగా తగ్గిస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే, అంతకంతకూ తగ్గుతున్న దేశ జీడీపీ వృద్ధి రేటు మళ్ళీ దౌడు అందుకొనే అవకాశాలున్నాయి.
వడ్డీ రేట్లు తగ్గితే గృహ, వాహన, వ్యక్తిగత, వ్యాపార రుణాలపై కూడా వడ్డీలు తగ్గుతాయి. దాంతో ఎక్కువ మంది కొత్త రుణాలు తీసుకోవడంతో పాటు ప్రస్తుత రుణాల చెల్లింపు సులభం అవుతుంది. దీంతో దేశంలో వినియోగం పెరుగుతుంది. అమ్మకాలు లేక దాదాపు ఏడాది కాలంగా ఉసూరుమంటున్న ఆటోమొబైల్ రంగానికి ఇది నిజంగా పండుగే అవుతుంది. ఆర్బీఐ కొత్త గవర్నర్ శక్తికాంత దాస్ నియమితులు అయినప్పటి నుంచీ వడ్డీ రేట్లను తగ్గిస్తూనే వచ్చారు. గత సమీక్షలో కూడా పరిస్థితులను బట్టి మరింత తగ్గించే అవకాశం ఉన్నట్లు ఆయన ఉప్పందించారు. దీంతో అన్ని వర్గాలు కూడా వడ్డీ రేట్లు తగ్గుతాయని భావిస్తున్నాయి.

5 శాతానికి రేపో రేటు...
ప్రస్తుతం కీలకమైన రేపో రేటు 5.40% గా ఉంది. దీనిని కనిష్టంగా పావు శాతం.. అంటే 0.25% నుంచి గరిష్టంగా అర శాతం (0.50%) మేరకు తగ్గించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. లేదా 0.40 శాతం తగ్గించి రేపో రేటును 5% వద్ద స్థిరంగా ఉంచే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. గతం లో ఎప్పుడు వడ్డీ రేట్లు తగ్గినా... కేవలం పావు శాతం లేదా అర శాతం వడ్డీ రేట్లు తగ్గుతూ వచ్చేవి. కానీ మొదటిసారి గత సమీక్ష సందర్భంగా 35 బేసిస్ పాయింట్లు (0.35%) తగ్గించింది. దీంతో ప్రస్తుతం 0.40% తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే 5% వద్ద రేపో రేటు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. బ్యాంకులు అధిక మొత్తంలో ఆర్బీఐ నుంచి రుణాలు తీసుకొని ... వాటిని వినియోగదారులకు అందిస్తాయి. ఇదిలా ఉండగా రివర్స్ రేపో రేటు ప్రస్తుతం 5.15% గా ఉండగా ... కాష్ రిజర్వు రేషియో (సిఆర్ఆర్) ప్రస్తుతం 4% గా ఉంది.
ఆర్థిక వ్యవస్థకు ఊతం ...
ఇప్పటికే ఆటోమొబైల్స్, ఎఫ్ఎంసీజీ రంగాల్లో అమ్మకాలు క్షీణించి 6 ఆరేళ్ళ కనిష్ఠానికి పడిపోయిన భారత ఆర్థిక వ్యవస్థకు వడ్డీ రేట్ల తగ్గింపుతో కొత్త జవసత్వాలు సమకూరే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్... ఈ దిశగా అనేక చర్యలు తీసుకొన్నారు. కార్పొరేట్ టాక్స్ ను 22% నికి కుదించారు. అక్టోబర్ 1 తర్వాత నెలకొల్పే తయారీ రంగ కంపెనీలకు కేవలం 15% కార్పొరేట్ టాక్స్ ను నిర్ణయించారు. ఎగుమతులకు రూ 50,000 కోట్ల ప్రోత్సహకాలు ప్రకటించారు. ప్రభుత్వరంగ బ్యాంకులకు భారీ మూలధనాన్ని సమకూర్చారు. దీంతో కుదేలైన స్టాక్ మార్కెట్లు ఒక్క సారిగా పరుగులు పెట్టాయి. అలాగే ఇప్పుడు కీలక వడ్డీ రేట్లు తగ్గితే దాని ప్రభావం అన్ని రంగాలపై కనిపించి మొత్తంగా ఆర్థిక వ్యవస్థ మళ్ళీ వృద్ధి బాటలో పయనించే అవకాశం ఉంది.
తక్కువ ద్రవ్యోల్బణం ...
భారత్ లో ప్రస్తుతం ద్రవ్యోల్బణం ... తక్కువగానే ఉంది. ఆగష్టు లో వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 3.21% గా నమోదు అయ్యింది. గతేడాదితో పోల్చితే కాస్త పెరిగినా ... ఈ ద్రవ్యోల్బణం పెద్ద ఆందోళనకరం కాదు. వృద్ధి గమనంలో ఉన్న ప్రపంచ దేశాలతో పోల్చితే భారత ద్రవ్యోల్బణం చాలా తక్కువేనని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఎదిగే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం అధికంగా ఉండవచ్చు. ఇది 5% మేరకు ఉన్నా ఆర్థిక వ్యవస్థకు వచ్చే ప్రమాదం ఏమి ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ప్రస్తుతం ఈ విషయాన్ని పరిగణన లోకి తీసుకొని కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పండుగల జోరు...
అంతా ఊహించినట్లుగా కీలక వడ్డీ రేట్లు తగ్గితే... దసరా, దీపావళి, సంక్రాంతి పండుగల సందర్భంగా గృహ, వాహన, వ్యక్తిగత, వ్యాపార రుణాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో వినియోగం పెరుగుతుందని లెక్కలేస్తున్నారు. దీని ప్రభావంతో పోయిన ఉద్యోగాలు తిరిగి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. అదే సమయంలో కొత్త ఉద్యోగాల కల్పన కూడా జరుగుతుందని భావిస్తున్నారు. అందుకే, రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించాలని కోరుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications