కొత్త టీవీ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇదే మంచి తరుణం. ఎందుకంటే టీవీల ధరలు భారీగా తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పన్నులు తగ్గించడం, దీనికితోడు పండుగ సీజన్ రావడంతో టీవీల ధరలు 30 శాతం వరకు తగ్గిపోయాయి.
గత దీపావళి నుంచి టీవీల అమ్మకాల్లో పెద్దగా వృద్ధి లేదు. మరోవైపు స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వాడకం బాగా పెరిగింది. ఎల్లప్పుడూ ఇవి జేబులోనో, చేతిలోనూ ఉంటుండడంతో టీవీల ముందు కూర్చోవడమే తగ్గించేశారు. దీంతో ఆయా కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు ధరల తగ్గింపు మంత్రం పఠిస్తున్నాయి.

ప్రముఖ బ్రాండ్లపై రూ.40 వేల వరకు తగ్గింపు...
శాంసంగ్, ఎల్‌జీ, సోనీ వంటి దేశీయ టాప్ టీవీ బ్రాండ్లు.. పెద్ద స్క్రీన్, ప్రీమియం మోడల్ విభాగంలో టీవీల ధరలను ఏకంగా రూ.40 వేల వరకు తగ్గించాయి. ఇక 32, 43 అంగుళాల టీవీల విషయానికొస్తే.. షావోమి, టీసీఎల్, ఐఫాల్కన్, వీయూ, కొడక్, థామ్సన్ వంటి కంపెనీలు కూడా టీవీల ధరలను బాగా తగ్గించేశాయి.

32 అంగుళాల టీవీ ఇప్పుడు రూ.7 వేలకే...
ధరల తగ్గింపుతో ఇప్పుడు 32 అంగుళాల టీవీ రూ.7 వేలకే లభిస్తుందంటే ఆశ్చర్యం కలగకమానదు. ఇక 43 అంగుళాల 4కే స్మార్ట్ టీవీ రూ.21 వేలకే అందుబాటులోకి వచ్చేసింది. ప్రీమియం విభాగంలోనూ టీవీల ధరలు గణనీయంగా తగ్గాయి. ఇప్పుడు 55 అంగుళాల సోనీ 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ టీవీ రూ.1.1 లక్షలకే వచ్చేస్తోంది. దీని ధర ఆగస్టు నెలలో రూ.1.3 లక్షలు. ఒక్క నెలకే రూ.20 వేలు తగ్గిపోయింది. ఇక ఎల్‌జీ కంపెనీ కూడా తన 65 అంగుళాల అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ టీవీ ధరను రూ.1.34 లక్షల నుంచి రూ.1.2 లక్షలకు తగ్గించింది.

మరో కారణం ఏమిటంటే...
టీవీల ధరలు తగ్గడానికి మరో కారణం కూడా ఉంది. ఈ మధ్యనే కేంద్రం కార్పొరేట్ పన్ను శాతం తగ్గింపుతోపాటు టీవీ ప్యానెళ్లపై కస్టమ్స్ ట్యాక్స్ కూడా తగ్గించింది. ఎల్‌ఈడీ టీవీల విషయానికొస్తే.. వాటి తయారీలో ఉపయోగించే ఓపెన్ సెల్ ప్యానల్స్ వ్యయమే 60-70 శాతం వరకు ఉంటుంది. దాదాపుగా టీవీలు తయారు చేసే కంపెనీలన్నీ ఈ ప్యానల్స్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. కస్టమ్స్ ట్యాక్స్ తగ్గింపుతో.. వాటి ధరలో 20-25 శాతం తగ్గింది. దీంతో ఆ తగ్గింపు ప్రయోజనాన్ని ఆయా కంపెనీలు వినియోగదారులకు బదలాయించి ఆ మేరకు టీవీల ధరలు తగ్గించాయి.

కొత్త కంపెనీల ఆగమనం...
ఈ ఏడాది టీవీల తయారీ, విక్రయాల రంగంలోకి కొత్త కంపెనీల ప్రవేశం కూడా కంపెనీల మధ్య, ధరల మధ్య పోటీ వాతావరణాన్ని సృష్టించింది. కేంద్రం వృద్ధి రేటు పెరిగేందుకు ఇటీవల తీసుకున్న నిర్ణయాలతో వాణిజ్య రంగంలో కొత్త పెట్టుబడులు, కంపెనీలు వస్తున్నాయి. దీంతో కొత్తగా వన్ ప్లస్, మోటరోలా కంపెనీలు కూడా టీవీల తయారీ రంగంలోకి ప్రవేశించాయి. రాబోయే రోజుల్లో ఈ కంపెనీల టీవీలు కూడా మార్కెట్‌లోకి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications