న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు మూడో నెల కూడా తగ్గాయి. సెప్టెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్ళు రూ.91,916 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు రెండు నెలలు కూడా రూ.లక్ష కోట్ల కంటే తగ్గాయి. ఆగస్ట్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.98,202 కోట్లు కాగా ఇప్పుడు అంతకంటే తగ్గాయి. గత ఏడాది (2018) సెప్టెంబర్ నెలలోనే రూ.94,442 కోట్లు. గత ఏడాది ఇదే నెల కంటే కూడా తగ్గాయి.
2019 సెప్టెంబర్ నెలకు గాను వసూలైన జీఎస్టీ మొత్తం వసూళ్లు రూ.91,916 కోట్లు అని, ఇందులో విభాగాల వారీగా చూస్తే సీజీఎస్టీ రూ.16,630 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.25,598 కోట్లు, ఐజీఎస్టీ రూ.45,069 కోట్లు, సెస్ రూ.7620 కోట్లు అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏప్రిల్ - సెప్టెంబర్ క్వార్టర్లో డొమెస్టిక్ కాంపోనెంట్ 7.82 శాతం పెరిగింది.

ఈ ఏడాది జూలై నెలలో జీఎస్టీ కలెక్షన్లు రూ.1.02 లక్షల కోట్లు కాగా, జూన్ నెలలో రూ.99,939 కోట్లు, ఆగస్ట్ నెలలో రూ.98,202 కోట్లు, ఇప్పుడు రూ.91,916 కోట్లు. గత 19 నెలల కాలంతో పోలిస్తే కనిష్ట వసూళ్లు సెప్టెంబర్ నెలలోనే అయ్యాయి.


Click it and Unblock the Notifications