సర్వీస్ ఛార్జీలపై సోషల్ మీడియాలో ప్రచారం, క్లారిటీ ఇచ్చిన SBI
వడ్డీ రేట్లు, సర్వీస్ ఛార్జీల మార్పుపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా స్పష్టతను ఇచ్చింది. విత్ డ్రాలు, ఏడాదికి 40 క్యాష్ డిపాజిట్స్, ఏటీఎం ట్రాన్సాక్షన్స్ నాలుగు ఫ్రీ అనే వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై ఎస్బీఐ స్పష్టతను ఇచ్చింది.
ఏడాదికి 40 క్యాష్ డిపాజిట్స్ లేదా విత్ డ్రాలు ఉచితమని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయని, ఇది వాస్తవం కాదని తెలిపింది. నెలకు నాలుగు ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఉచితమని జరిగిన ప్రచారంలోను వాస్తవం లేదని తెలిపింది.

- క్యాష్ డిపాజిట్స్ నెలకు 3 ఉచితం, ఏడాదికి 36 ఉచితం.
- క్యాష్ విత్‌డ్రాలు నెలకు 2 ఉచితం, ఏడాదికి 24 ఉచితం.
- ఓన్ బ్యాంకు ఏటీఎంలో నెలకు 3/5 ట్రాన్సాక్షన్‌లు ఉచితం. ఏడాదికి 36/60 ఉచితం.
- మొత్తంగా నెలకు 13/15 ఉచితం, ఏడాదికి 156/180 ఉచితం.
- అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు అమలులోకి వస్తున్నది నిజమేనని, కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తెలిపింది.
కాగా, ఇతర బ్యాంకు ఏటీఎంలో ట్రాన్సాక్షన్స్ విషయానికి వస్తే నెలకు మెట్రోలో 3, ఇతర ప్రాంతాల్లో 5, ఏడాదికి మెట్రోలో 36, ఇతర ప్రాంతాల్లో 60 ట్రాన్సాక్షన్స్ ఫ్రీ.
మొత్తం ట్రాన్సాక్షన్స్ నెలకు మెట్రోలో 13, ఇతర ప్రాంతాల్లో 15, ఏడాదికి మెట్రోలో 156, ఇతర ప్రాంతాల్లో 180 ట్రాన్సాక్షన్స్ ఫ్రీ.


Click it and Unblock the Notifications