దసరా-దీపావళి బంపరాఫర్: కొంటే చాలు 30 రోజుల్లో 30 కార్లు!
హైదరాబాద్: ఫెస్టివల్ సీజన్‌పై ఈ-కామర్స్ బిజినెస్, వ్యాపార వర్గాలు భారీ ఆశలు పెట్టుకుంటాయి. ముఖ్యంగా దసరా, దీపావళి సీజన్లో సేల్స్ భారీగా ఉంటాయి. వ్యాపార వర్గాలు భారీ ఆఫర్లు, డిస్కౌంట్‌లు, క్యాష్ బ్యాక్ ఇస్తుంటాయి. ఇందుకోసం సంబంధిత సంస్థలతో జట్టు కడుతుంటాయి. ఈ దసరా, దీపావళి పండుగ సందర్భంగా బిగ్ సీ డబుల్ ధమాకా ఆఫర్‌ను ప్రకటించింది.

ఆఫర్ ఏమిటి?
బిగ్ సీలో మొబైల్ కొనుగోలు చేసిన కస్టమర్లకు 30 రోజుల లక్కీ డ్రాలో 30 కార్లు, 30 ద్విచక్ర వాహనాలను అందిస్తారు. ప్రతి పండుగను, పర్వదినాన్ని, విశేష సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడం బిగ్ సీ ఆనవాయితీ. ఇందులో భాగంగా దసరా దీపావళి డబుల్ ధమాకాను ప్రకటించినట్లు సంస్థ వ్యవస్థాపకులు, సీఎండి బాలు చెప్పారు.

క్యాష్ బ్యాక్, బహుమతులు
లక్కీ డ్రాతో పాటు వివిధ బ్యాంకుల కార్డులపై క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్లు కూడా ఉన్నాయి. లక్కీ డ్రాతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో కొనుగోలు చేసిన వారికి పది శాతం క్యాష్ బ్యాక్, సులభ వాయిదాల్లో మొబైల్ కొనుగోలు చేసిన వారికి ఒక ఈఎంఐ ఉచితం, 30 శాతం పేటీఎం క్యాష్ బ్యాక్, ప్రతి మొబైల్ కొనుగోలుపై కచ్చితమైన బహుమతి ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే, ఎంఐ ఫోన్లపై 10 శాతం క్యాష్ బ్యాక్ ఉంది.

30 రోజుల్లో ముప్పై కార్లు
కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్లను వినియోగించుకొని విలువైన బహుమతులు గెలుచుకోవాలని కంపెనీ వ్యవస్థాపకులు సూచించారు. కాగా, 30 రోజుల్లో 30 కార్లు పేరుతో ఈ దసరా దీపావళి ధమాకాను అందిస్తున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications