మీరు గమనించారా.. మీకు ఫోన్ వచ్చినప్పుడు ఎంత సేపు రింగ్ అవుతుందో... మీరు ఏదైనా పనిలో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయడానికి వచ్చే సరికే ఫోన్ రింగ్ ఆగిపోతోందని గుర్తించారా. అప్పుడు మీరు ఏమనుకుని ఉంటారంటే.. మిస్డ్ కాల్ చేసి ఉంటారని. కానీ మీకు ఫోన్ చేసిన వారు మిస్డ్ కాల్ చేయలేదని, మీకు వచ్చే కాల్ రింగ్ సమయం తగ్గిందని మీకు తెలుసా. అవునండి ఇది నిజమే. టెలికాం కంపెనీలు మొబైల్ కాల్ రింగ్ సమయాన్ని తగ్గించాయి. ఇంతకు ముందు రింగింగ్ సమయం 45 సెకండ్లు ఉండేది. దాన్ని 25 సెకన్లకు తగ్గించారు. తాజాగా ఇదే విషయాన్నీ టెలికాం రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ ట్రాయ్ కి ఎయిర్ టెల్ వెల్లడించింది.

అసలు ఏం జరిగిందంటే...
* దేశీయ టెలికాం రంగంలో రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. కస్టమర్లను సంపాదించుకోవడానికి ఈ కంపెనీలు నానా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇటీవలి కాలంలో రిలయన్స్ జియో అవుట్ గోయింగ్ రింగింగ్ సమయాన్ని 25 సెకన్లకు తగ్గించింది. ఇదే విషయాన్నీ ట్రాయ్ కి ఎయిర్ టెల్ తెలియజేసింది. దీన్ని 45 సెకన్లకు పెంచాలని లేదా 30 సెకన్ల కన్నా పెంచాలని కోరింది. కానీ జియో నుంచి స్పందన లేకపోవడంతో తన నెట్ వర్క్ నుంచి చేసే అవుట్ గోయింగ్ కాల్ సమయాన్ని 25 సెకన్లకు తగ్గిస్తున్నట్టు ట్రాయ్ కి ఎయిర్ టెల్ తెలియ జేసింది.
* ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జీ (ఐ యు సి ) నష్టాన్ని తగ్గించుకోవడానికి తాము కూడా రింగింగ్ సమయాన్ని తగ్గించక తప్పలేదని ఎయిర్ టెల్ అంటోంది. జియో పేరు వెల్లడించకుండా గత వారంలో ఎయిర్ టెల్ ఆరోపణలు చేసింది. అవుట్ గోయింగ్ కాల్ రింగింగ్ సమయాన్ని తగ్గించి ఇంటర్ కనెక్ట్ యూసేజ్ వ్యవస్థతో ఆడుకుంటున్నట్టు పేర్కొంది.

జియో ఏమంటోందంటే...
* కొన్ని టెలికామ్ కంపెనీలు తమ తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఐ యూ సి పేరుతో నిందిస్తున్నట్టు కంపెనీ అధికారి ఒకరు అంటున్నారు.
* ఈ కంపెనీలు తమ 2జి, 3జి కస్టమర్ల నుంచి వాయిస్ కాల్స్ కు ఎక్కువ చార్జీలను వసూలు చేస్తున్నట్టు చెబుతున్నారు.
* ఈ కంపెనీల కస్టమర్లు నిమిషానికి రూ.1.50 వరకు చెల్లించాల్సి వస్తోందని, ఇలా చెల్లించే కస్టమర్లు జియో వినియోగదారులకు మిస్డ్ కాల్ చేస్తూ తమకు తమకు కాల్ చేయమని కోరుతున్నారని అంటున్నారు. ఇది 25 శాతం నుంచి 30 శాతం వరకు ఉన్నట్టు చెబుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఎలా ఉందంటే...
* ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రింగింగ్ సమయం 15-20 సెకన్లు అమల్లో ఉందని జియో వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో 25 సెకన్ల కాలపరిమితి ప్రపంచ ప్రమాణాలకు అనుగుణమైనదేనని అంటున్నారు.
* ప్రస్తుతం మన దేశంలో ఇంటర్ కనెక్షన్ యూసేజ్ చార్జీ నిమిషానికి 6 పైసలుగా ఉంది.
* ఏ నెట్ వర్క్ కయితే కాల్ వెళుతుందో ఆ టెలికాం కంపెనీకి ఫోన్ వచ్చిన టెలికం కంపెనీ నిమిషానికి ఆరు పైసలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు ఇది నిమిషానికి 14 పైసలు ఉండేది. 2020 జనవరి నుంచి ఇది సున్నాకు చేరనుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications