For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ నష్టాల్లో మార్కెట్లు: 600 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్, 150 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

|

ముంబై: మార్కెట్లు మధ్యాహ్నం నుంచి నష్టాలబాట పట్టాయి. మధ్యాహ్నం గం.2.33 నిమిషాలకు సెన్సెక్స్ 493.26 (1.28%) పాయింట్లు నష్టపోయి 38,174.07 వద్ద ట్రేడ్ అయింది. కాసేపటికి మొత్తంగా 578 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 153.00 (1.33%) పాయింట్లు తగ్గి 11,321.45 వద్ద ట్రేడ్ అయింది. 11,500 పాయింట్ల కంటే దిగువకు చేరింది.

Market update: Nifty back above 11,500, Sensex gains above 100 pts

అంతకుముందు, స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం గం.9.30 నిమిషాలకు సెన్సెక్స్ 150 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 50 పాయింట్లు లాభపడింది. మధ్యాహ్నం గం.11.20 సమయానికి 135.44 (0.35%) పాయింట్లు ఎగిసి 38,802.77 వద్ద, నిఫ్టీ 36.20 (0.32%) లాభపడి 11,510.65 వద్ద ట్రేడ్ అయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.77గా ఉంది.

ఏటీఎం క్యాష్ ఉపసంహరణ కొత్త రూల్స్ తెలుసుకోండిఏటీఎం క్యాష్ ఉపసంహరణ కొత్త రూల్స్ తెలుసుకోండి

పదిన్నర గంటల సమయం వరకు నిఫ్టీలో టాప్ గెయినర్స్ బీపీసీఎల్, ఐవోసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌యూఎల్, ఏసియన్ పేయింట్స్ కాగా, టాప్ లూజర్స్‌లో ఇండస్ ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, హెచ్‌సీఎల్ టెక్, కోల్ ఇండియా, గ్రాసిమ్ ఉన్నాయి.

అమెరికా - చైనా ట్రేడ్ వార్ అంశం తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు సానుకూలంగా ట్రేడ్ అయ్యాయి. అంతర్జాతీయంగా కూడా మార్కెట్లు సానుకూలంగానే ఉన్నాయి. డోజన్స్ 0.36 శాతం లాభపడగా, ఎస్ అడ్ పీ 500 కూడా 0.5 శాతం లాభపడింది. నాస్‌డాక్ కాంపోజిట్ 0.75 శాతం పెరిగింది. జపాన్ నిక్కీ 0.6 శాతం పెరిగింది.

English summary

భారీ నష్టాల్లో మార్కెట్లు: 600 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్, 150 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ | Market update: Nifty back above 11,500, Sensex gains above 100 pts

The market extended gains in late morning deals with the Sensex rising 182.47 points to 38,849.80 and the Nifty50 climbing 53.50 points to 11,528.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X