గుడ్ న్యూస్: రూ.699కే జియో ఫోన్! రిలయన్స్ దివాళీ ఆఫర్
దసరా, దీపావళి సందర్భంగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. ఇందులో భాగంగా 4జి ఫీచర్ ఫోన్ 'జియో ఫోన్' ను రూ. 699 కే ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈ ఆఫర్ దసరా నుంచి దీపావళి వరకు మాత్రమే ఉంటుందని తెలిపింది. మరింత మంది కస్టమర్లకు జియో సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ అఫర్ దోహదపడుతుందని కంపెనీ చెబుతోంది. దేశవ్యాప్తంగా 50 కోట్ల మంది కస్టమర్లను సంపాదించుకోవాలన్నది జియో లక్ష్యం. ఇందుకు అనుగుణంగానే తన ఆఫర్లను తెస్తోంది. తాజా ఆఫర్ ద్వారా చాలామంది 2జి కస్టమర్లు 4జి కి మారడానికి అవకాశం ఉంటుందని కంపెనీ భావిస్తోంది.
* ప్రస్తుతం జియో ఫోన్ ను రిలయన్స్ రూ.1,500 కు విక్రయిస్తోంది. దసరా, దీపావళి ఆఫర్లో భాగంగా కేవలం రూ.699కే ఈ ఫోన్ ను అందించనుంది. దీనివల్ల రూ.800 ఆదా అవుతుంది.

* ఈ ఆఫర్ కింద పాత ఫోన్ ను ఎక్స్చేంజి చేయాల్సిన అవసరం లేదు.
*రూ.800 ఆదాతోపాటు రూ.700 విలువైన డేటాను అందిస్తుంది. మొత్తంగా జియో ఫోన్ కస్టమర్లకు రూ.1,500 ప్రయోజనం లభిస్తుందని కంపెనీ చెబుతోంది.
* మొదటి 7 రీఛార్జ్ లపై జియో అదనంగా రూ.99 విలువైన డేటాను అందించనుంది.
* ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 35 కోట్లమంది 2జి కస్టమర్లు ఉన్నారు. వీరిలో మెజారిటీ కస్టమర్లను 4జి లోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది.
* అందుబాటు ధరల్లో ఇంటర్నెట్ లభించలేదని ఏ ఒక్క భారతీయుడు బాధపడొద్దని, అందుకే జియో ఫోన్ దీవాలి గిఫ్ట్ తెచ్చినట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ చెబుతున్నారు. ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థలోకి దిగువ స్థాయిలో ఉన్న ప్రతి భారతీయుడిని తీసుకువచ్చేందుకు రూ.1,500 పెట్టుబడి పెడుతున్నట్టు అయన పేర్కొన్నారు.
ఇవీ జియో ఫోన్ ఫీచర్లు..
* 2.4 అంగుళాల క్యూ వీ జీ ఏ డిస్ప్లే
* ఎస్ డీ కార్డు స్లాట్
* 2,000 ఎమ్ ఏ హెచ్ బ్యాటరీ
* 4 వే నావిగేషన్
* హెడ్ ఫోన్ జాక్
* టార్చ్ లైట్
* ఎఫ్ ఎం రేడియో
* ముందు 0.3 ఎం పీ కెమెరా, వెనుక 2 ఎం పీ కెమెరా
* మైక్రో ఫోన్ , స్పీకర్


Click it and Unblock the Notifications