ఈజీగా ఇన్సూరెన్సు పాలసీలు: ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ జట్టు

మన దేశంలో 130 కోట్లకు పైగా జనాభా ఉంది. కానీ ఇందులో చాలా తక్కువ శాతం మందికి మాత్రమే బీమా రక్షణ ఉంది. బీమాపై అవగాహన లేకపోవడం, బీమా పాలసీల లభ్యత తదితర అంశాలు ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. అయితే బీమాను మరింత చేరువ చేసేందుకు కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా బీమా కంపెనీలు, నవతరం బ్యాంకులు చేతులు కలుపుతున్నాయి.

ఎయిర్ టెల్, ఐసీఐసీఐ...

ఎయిర్ టెల్, ఐసీఐసీఐ...

*తాజాగా ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకు, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్సు కంపెనీలు జట్టు కట్టాయి. ఈ మేరకు వీటి మధ్య కార్పొరేట్ ఏజెన్సీ ఒప్పందం కుదిరింది.

దీని వల్ల ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బీమా ఉత్పత్తులు కొనుగోలుచేసే వెసులుబాటు లభిస్తుంది.

*బీమా ఉత్పత్పులు దేశవ్యాప్తంగా 60,000కు పైగా ఎయిర్ టెల్ పే మెంట్స్ బ్యాంక్ - బ్యాంకింగ్ పాయింట్ల ద్వారా అందుబాటులో ఉంటాయి.

* ఈ పాలసీలను ఎయిర్ టెల్ ప్రెమెంట్స్ బ్యాంకు కస్టమర్లు పేపర్ రహితంగా, సురక్షితంగా, వేగవంతంగా కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నాయి.

* ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు జీవిత బీమాతోపా టు సేవింగ్స్ ప్లాన్లు తీసుకోవచ్చు. దీని వల్ల వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక రక్షణతో పాటు దీర్ఘకాలంలో పొదుపు మొత్తం పెరగడానికి అవకాసహం ఉంటుంది.

* ఎయిర్ టెల్ ప్రెమెంట్స్ బ్యాంకుకు భారీ స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ఉంది. దేశ వ్యాప్తంగా ఇంకా లక్షలాది మంది బీమా రక్షణ పొందలేదు. ఐసి సిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్సు ఇన్నోవేటివ్, అందుబాటు ధరల్లో బీమా ఉత్పత్తుల కారణంగా వీరిని చేరుకునే అవకాశం ఉందని ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ భావిస్తోంది.

తొలుత ఈ పాలసీలు...

తొలుత ఈ పాలసీలు...

* తొలుత సేవింగ్స్ ప్లాట్ ఫామ్ పై ఐసిఐసిఐ ప్రు ఐ ప్రొటెక్ట్ స్మార్ట్ ను అందుబాటులోకి తీసుకు రానున్నారు. ఆ తర్వాత ఐసిఐసిఐ అన్మోల్ బఛత్ ను అందుబాటులోకి తెస్తారు. ఈ ప్లాన్ మైక్రో ఇన్సూరెన్సు ప్రోడక్ట్. దీని ద్వారా పొదుపుతో పాటు రక్షణ కూడా లభిస్తుంది. దీని ధర కూడా తక్కువ స్థాయిలోనే ఉంటుంది. కాబట్టి బీమా రక్షణలేని వారు దీనిని కొనుగోలుచేసి అవకాశం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

* ఐ ప్రొటెక్ట్ అనేదే టర్మ్ ప్లాన్. దీని వల్ల బీమా తీసుకున్న వారు దురదృష్టవశాత్తు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఆర్ధిక రక్షణ లభిస్తుంది.

* ఎయిర్ టెల్ బ్యాంకు ఖాతా దారులు ఈ పాలసీలను చాలా సులభంగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

ఉభయ తారకం

ఉభయ తారకం

* ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ 2017 లో ప్రారంభమైంది. 29 రాష్ట్రాల్లో 5 లక్షల బ్యాంకింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. అయితే తొలుత 60,000 బ్యాంకింగ్ పాయింట్ల ద్వారా బీమా, పెన్షన్ ఉత్పత్తులను మరింత ఎక్కువ మందికి చేరువ చేయాలని ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ యోచిస్తోంది.

ఈ సంస్థకు 4 కోట్లకు పైగా కస్టమర్లు ఉన్నారు. ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఫిజికల్ బ్యాంకింగ్ పాయింట్ల ద్వారానే కాకుండా తన ఆప్ ద్వారాబ్యాంకింగ్ సర్వీసులను అందిస్తోంది. అయితే ఇప్పుడు బీమా ఉత్పత్తులను అందించడానికి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్సు తో జట్టు కట్టడం వల్ల తన కస్టమర్లు బీమా ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దీని వల్ల కంపెనీకి కమీషన్ వస్తుంది. అటు బీమా ఉత్పత్తులు అమ్ముడవుతాయి. కాబట్టి ఉభయతారకంగా ఉంటుంది.

* ఇప్పటికీ ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకు తన బ్యాంకు ఖాతా దారులకు బీమా సదుపాయం కల్పిస్తోంది. పలు రకాల రీఛార్జ్ లపైనా కూడా బీమా ప్రీపెయిడ్ టెలి కామ్ కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+