న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ పండుగ సీజన్లో మీ కలలను నెరవేర్చేందుకు ప్రత్యేక లక్షణాలతో రిటైల్ రుణాలను మీకు అందించడం ద్వారా మీ భక్తి, విశ్వాసం, వేడుకలను ఎస్బీఐ గౌరవిస్తుందని పేర్కొంది.
హోమ్, పర్సనల్, కారు లోన్స్ అతి తక్కువకు..
హోమ్ లోన్స్, కారు లోన్స్, పర్సనల్ లోన్స్‌తో ఈ పండుగను మరింత సంబరంగా జరుపుకోండని పేర్కొంది. హోమ్ లోన్ పైన కాంపిటేటివ్ ఇంటరెస్ట్ రేట్, కారు లోన్స్ పైన తక్కువ వడ్డీ, జీరో ప్రాసిసెంగ్ ఫీజు, యోనో ద్వారా అదనపు ప్రయోజనాలు, పర్సనల్ లోన్ పైన తక్కువ వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు పైన 50 శాతం తగ్గింపు ఆఫర్లు ఉన్నట్లు పేర్కొంది.
8.15 శాతం వడ్డీ రేటు.. షరతులు వర్తిస్తాయి!
మూడు రోజుల క్రితం కూడా హోమ్ లోన్ పైన ఎస్బీఐ ట్వీట్ చేసింది. 'SBi హోమ్‌లోన్‌తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి. ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటు విధానంలో హోమ్ లోన్ వడ్డీ రేటు 8.15% నుంచి ప్రారంభమౌతోంది. ఇప్పుడు మీరు సొంతిల్లు కలిగి ఉండొచ్చు. అక్టోబర్ 1 నుంచి ఈ రుణాలు అందుబాటటులోకి వస్తాయి' అని పేర్కొంది. 8.15 శాతం వడ్డీ రేటుకు షరతులు వర్తిస్తాయని కూడా పేర్కొంది.

ఎస్బీఐ గుడ్ న్యూస్
ఈ నేపథ్యంలో పండుగ సీజన్‌లో హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వారికి ఇది గుడ్ న్యూస్. ఎస్బీఐ రెపో రేటు ఆధారిత హోమ్ లోన్స్‌ను మళ్లీ ఆపర్ చేస్తామని ఇదివరకు చెప్పింది. అక్టోబర్ 1 నుంచి రుణాలు అందుబాటులోకి వస్తాయి. బ్యాంకు ఈ ఏడాది జూలై 1న ఈ రుణాలను ఆవిష్కరించింది. అయితే ఆ తర్వాత ఈ రుణాలను ఉపసంహరించుకుంది. ఇప్పుడు మళ్లీ వీటిని కొన్ని మార్పులతో కస్టమర్లకు అందించనుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications