ముంబై: ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఆన్‌లైన్ టిక్కెటింగ్, టూరిజం, కేటరింగ్ సంస్థ IRCTC ఐపీవోకు వెళ్లిన మొదటి గంటలోనే ఎనిమిది శాతం షేర్లు సబ్‌స్క్రైబ్ అయ్యాయి. సోమవారం (సెప్టెంబర్ 30) 11 గంటలకు 16,06,560 షేర్లకు బిడ్స్ అందాయి. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల వరకు 71 శాతం సబ్‌స్క్రైబ్ అయ్యాయి. 1,43,58,160 షేర్లకు బిడ్స్ అందాయి. సాయంత్రానికి 76 శాతం సబ్‌స్క్రైబ్ అయ్యాయి.
మొత్తం 2,01,60,000 షేర్లను ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంచారు. ఈ రోజు ప్రారంభమైన బిడ్స్ అక్టోబర్ 3వ తేదీ వరకు స్వీకరిస్తారు. ఒక్కో షేర్ ధరను రూ.315 నుంచి రూ.320గా నిర్ణయించారు. దీని ద్వారా మొత్తం రూ.645 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పెట్టుబడుల ఉపసంహరణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఐపీవో ద్వారా వచ్చే మొత్తం ఆదాయం ప్రభుత్వానికి చెందుతుంది. ఈ ఆఫర్‌లో ప్రభుత్వం 12.5 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయిస్తోంది. దీంతో ప్రభుత్వ వాటా 87.5 శాతానికి తగ్గనుంది. ఐడీబీఐ కేపిటల్స్ మార్కెట్స్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, యస్ సెక్యూరిటీస్ సంస్థలు ఈ ఐపీవోకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.
అలంకిత్ అసైన్మెంట్స్ లిమిటెడ్ సంస్థ దీనికి రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తోంది. ఈ ఐపీవోలో 40 షేర్లను ఒక లాటుగా నిర్ణయించింది. అంటే చేతిలో రూ.12,200 నుంచి రూ.12,400 కలిగి ఉండాలి. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 70 లక్షల షేర్లు రిజర్వ్ చేసింది. అర్హత ఉన్న ఉద్యోగులకు, రిటైల్ పెట్టుబడిదారులకు రూ.10 డిస్కౌంట్ ఉంది. 1.60 లక్షల షేర్లను వీరికి రిజర్వ్ చేసింది.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications