ఐర్లాండ్‌లో ఓ వ్యక్తికి 8.5 అడుగుల పొడవు ఉన్న ట్యూనా చేప చిక్కింది. అయితే దానిని తిరిగి అతను సముద్రంలోనే వదిలి పెట్టాడు. వెస్ట్ కార్క్‌కు చెందిన డేవ్ ఎడ్వర్డ్ అనే వ్యక్తికి ఈ ట్యూనా చేప చిక్కింది. ఇటీవలి కాలంలో ఐరిష్ వాటర్‌లో పట్టుబడిన అతిపెద్ద చేప ఇది. దీని విలువ జపాన్‌లో 3 మిలియన్ల యూరోల వరకు ఉంటుంది. అంటే మన రూపాయల్లో దాదాపు రూ.23 కోట్లు.
అయితే డేవ్ ఎడ్వర్డ్, అతని టీమ్ సభ్యులు డారీన్ ఓ సులివాన్, వెల్డ్‌మాన్‌లు మాత్రం కమర్షియల్ కోణంలో చేపలు పట్టడం లేదు. వాస్తవానికి వారు అట్లాంటిక్ సముద్రంలో తాము ఉంటున్న ప్రదేశంలోని చేపల రకాలు, సంఖ్య కోసం క్యాచ్ అండ్ రిలీజ్ ప్రోగ్రామ్ చేపట్టారు. ఇందులో భాగంగా వారికి ట్యూనా చేప దొరికింది. ఈ భారీ ట్యూనా చేపల చిత్రాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

క్యాచ్ అండ్ రిలీజ్ ప్రోగ్రాంలో భాగంగా డేవ్ ఎడ్వర్డ్ అండ్ టీమ్ 15 బోట్లను తీసుకు వెళ్లింది. ఈ ప్రోగ్రామ్ అక్టోబర్ 15వ తేదీ వరకు సాగుతుంది. వీరికి పట్టుబడిన ట్యూనా చేప 270 కిలోల బరువు ఉంటుంది.
ఈ ట్యూనా చేపలు సాధారణమైనవేనని, చాలా పెద్దవిగా ఉంటాయని, ఈ సంవత్సరం డోనెగల్ బేకు దక్షిణాన పట్టుబడిన మొదటి చేప ఇది అని, నిజంగా చాలా పెద్దది అని పేర్కొన్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications