కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్ 1972ను సవరించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి ప్రయోజనం చేకూరుతుంది. సర్వీస్‌లో చేరిన ఉద్యోగి మరణిస్తే 54 సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్ 1972 ప్రకారం సదరు ఉద్యోగి ఫ్యామిలీ పెన్షన్ పొందవచ్చు. వీటిలో మార్పులు చేసి, ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది.

వారికి 30 శాతమే పెన్షన్..
నాటి రూల్ ప్రకారం అతని కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్ కింద ఉద్యోగి చివరగా తీసుకున్న వేతనంలో 50 శాతం వారి కుటుంబానికి చెల్లిస్తుంది. అయితే విధుల్లో చేరిన ఏడేళ్ల తర్వాత మరణించిన ఉద్యోగి కుటుంబానికి మాత్రమే ఈ ప్రయోజనం ఉంటుంది. 7 ఏళ్ల లోపు కనుక ఉద్యోగి మృతి చెందితే సదరు ఎంప్లాయ్ ఫ్యామిలీకి చివరి వేతనంలో 30 శాతం మాత్రమే పెన్షన్ అందుతోంది.

పదేళ్ల పాటు 50 శాతం పెన్షన్
దీనిపై మోడీ ప్రభుత్వం సవరణలు చేసింది. ఇక నుంచి ఇలాంటి వారికి కూడా 50 శాతం పెన్షన్ అందుతుంది. ఇళా పదేళ్ల వరకు పెన్షన్ పొందుతారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుంది. కేంద్రం సెప్టెంబర్ 19న నోటిఫికేషన్‌లో ఈ విషయాన్ని తెలిపింది. ఈ సవరణతో సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ సహా వివిధ ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది.

వేతనం తక్కువ.. అందుకే..
సెప్టెంబర్ 24వ తేదీన యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవాన్స్ అండ్ పెన్షన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగులు ఎవరైనా మృతి చెందితే ప్రస్తుత పరిస్థితుల్లో వారి కుటుంబానికి ఎక్కువ పెన్షన్ అవసరమని ప్రభుత్వం గుర్తించిందని పేర్కొంది. ప్రారంభ వేతనం తక్కువగా ఉంటుందని, ఈ నేపథ్యంలో నిబంధనను సవరించినట్లు తెలిపింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications