For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఊగిసలాడలో మార్కెట్లు: టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ ఇవే...

|

ముంబై: శుక్రవారం స్టాక్ మార్కెట్లో నష్టాలతో ముగిశాయి. వాణిజ్య ఆందోళనలు, ట్రంప్ అభిశంసన భయాలు మార్కెట్లకు నష్టాలు తీసుకు వచ్చాయి. ఉదయం నుంచి అనిశ్చితుల్లోనే కనిపించాయి. సెన్సెక్స్ 167 పాయింట్ల నష్టంతో 38,822 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 59 పాయింట్లు నష్టపోయి 11,512 వద్ద ముగిసింది.

ఉదయం మార్కెట్లు..

స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఊగిసలాటలో ఉన్నాయి. ఉదయం గం.9.20కి సెన్సెక్స్ 134.59 పాయింట్ల నష్టంతో 38,855.15 వద్ద, నిఫ్టీ 48.05 పాయింట్ల నష్టంతో 11,523.15వద్ద ప్రారంభమైంది. 433 షేర్లు లాభాల్లో, 385 షేర్లు నష్టాల్లో ఉండగా, 33 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. ఆ తర్వాత గం.9.46 నిమిషాలకు సెన్సెక్స్ 10 పాయింట్లు లాభపడి 39,000 మార్క్ దాటగా, నిఫ్టీ 11,559 వద్ద ట్రేడ్ అయింది. మధ్యాహ్నం గం.11.15 సమయానికి సెన్సెక్స్ 117.61 (0.30%) పాయింట్లు కోల్పోయి 38,872.13 వద్ద, నిఫ్టీ 45.25 (0.39%) పాయింట్లు కోల్పోయి 11,525.95 వద్ద ట్రేడ్ అయింది.

డాలరుతో రూపాయి మారకం విలువ 70.93 వద్ద ఉంది. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ పైన అభిశంసన సందిగ్ధత నేపథ్యంలో అమెరికా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. ఇవి ఆసియా, దేశీయ మార్కెట్ పైన ప్రభావం చూపాయి.

Markets Update: Sensex, Nifty choppy

టాప్ గెయినర్స్...
Bajaj Finance ధర 4,068.85గా ఉంది. ఈ సెషన్‌లో ఇప్పటి వరకు రూ.68.05 లేదా 1.70 శాతం పెరిగింది.

ITC ధర 254.40 ఉండగా, ఈ సెషన్లో ఇప్పటి వరకు 4.00 లేదా 1.60 శాతం పెరిగింది.
Cipla ధర 444.70గా ఉండగా, ఈ సెషన్లో ఇప్పటి వరకు రూ.6.25 లేదా 1.43 శాతం పెరిగింది.
IOC ధర 146.00 ఉండగా, ఈ సెషన్లో ఇప్పటి వరకు రూ.1.45 లేదా 1.00 శాతం పెరిగింది.
Reliance ధర 1,309.00 ఉండగా ఈ సెషన్లో ఇప్పటి వరకు రూ.12.20 లేదా 0.94 శాతం పెరిగింది.

టాప్ లూజర్స్...
Vedanta ధర 157.95 ఉంది. రూ. 8.15 లేదా 4.91 శాతం తగ్గింది.

Tata Motors ధర 118.65 ఉంది. రూ.5.85 లేదా 4.70 శాతం తగ్గింది.
ONGC ధర 130.85 ఉంది. రూ.6.20 లేదా 4.52 శాతం తగ్గింది.
Tata Steel ధర 360.30గా ఉంది. రూ.15.45 లేదా 4.11 శాతం తగ్గింది.
Zee Entertain ధర 275.00గా ఉంది. ధర రూ.11.70 లేదా 4.08 శాతం తగ్గింది.

<strong>గుడ్‌న్యూస్: ఇక ఆరోగ్య బీమా ప్రీమియం నెలవారీగా చెల్లించవచ్చు</strong>గుడ్‌న్యూస్: ఇక ఆరోగ్య బీమా ప్రీమియం నెలవారీగా చెల్లించవచ్చు

కాగా, గురువారం మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. చైనాతో వాణిజ్య యుద్ధం సమసిపోతోందన్న ట్రంప్ వ్యాఖ్యలు మార్కెట్లలో జోష్‌ను తీసుకు వచ్చాయి. ప్రస్తుత నెలకు గాను డెరివేటివ్ కాంట్రాక్టు గడువు ముగియడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు మార్కెట్లను మరింత ముందుకు తీసుకెళ్ళాయి. డెరివేటివ్ కాంట్రాక్టు గడువు ముగిసినప్పటికీ, వచ్చే వారంలో రిజర్వ్ బ్యాంక్ ప్రకటించనున్న పరపతి సమీక్షలో తీసుకునే నిర్ణయంపై పెట్టుబడిదారులు దృష్టి సారించారు.

ఫలితంగా ఇండెక్స్ 396.22 పాయింట్ల (1.03 శాతం) లాభంతో 38,989.74 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 131 పాయింట్లు అధికమై 11,571.20 వద్ద ముగిసింది. మార్కెట్ల భారీ ర్యాలీతో మదుపరుల సంపద అమాంతం పెరిగింది. బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.1,57,091.31 కోట్లు పెరిగి రూ.1,48,45,854.70 కోట్లకు చేరాయి.

English summary

ఊగిసలాడలో మార్కెట్లు: టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ ఇవే... | Markets Update: Sensex, Nifty choppy

Equity benchmark BSE Sensex and NSE Nifty started on a volatile note on Friday, tracking weak cues from global markets as concerns over US political uncertainty kept investors on edge.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X