తక్కువ రిస్క్ డెట్ ఫండ్స్ ఎంచుకోండిలా?

తమ పెట్టుబడుల విషయంలో రిస్క్ వద్దనుకునే వారు ముందుగా ఓటు వేసేది బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లకేనన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ డిపాజిట్లకు ప్రత్యామ్నాయంగా మ్యూచువల్ ఫండ్స్ లో డెట్ మ్యూచువల్ ఫండ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి ప్రత్యామ్నాయమే అయినప్పటికీ పూర్తిగా రిస్క్ లేకుండా మాత్రం ఉండవు. అయితే ఇవి ఈక్విటీ ఫండ్స్ అంత రిస్క్ మాత్రం కావని చెప్పవచ్చు. ఈ ఫండ్స్ లో పెట్టుబడుల వల్ల మూలధనం కొంత మేరకు కరిగి పోయే అవకాశం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.

గత ఏడాది, ఏడాదిన్నర కాలంలో డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఊహించని విధంగా ప్రభావితం అయ్యాయి. ఇందుకు కొన్ని కార్పొరేట్ కంపెనీల బాండ్లు డౌన్ గ్రేడ్ కావడం, డీఫాల్ట్ లు వంటివి కారణంగా చెప్పవచ్చు. గత ఏడాదిన్నర కాలంలో ఏం జరిగిందో ఇన్వెస్టర్లకు గుర్తుండే ఉంటుంది. ఐ ఎల్ అండ్ ఎఫ్ ఎస్ సంక్షోభం మొత్తం మార్కెట్ పరిస్థితులను మార్చివేసింది. ఆ తర్వాతి కాలంలో ఈ సంస్థతో పాటు డీ హెచ్ ఎఫ్ ఎల్, ఎస్సెల్ గ్రూప్, రిలయన్స్ అడాగ్ గ్రూప్ తెచ్చిన బాండ్స్ డౌన్ గ్రేడ్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వాటిలో పెట్టుబడులను తగ్గించుకున్నాయి. లిక్విడ్ ఫండ్స్ సహా డెట్ ఫండ్స్ తమ నికర ఆస్తి విలువ (ఎన్ఏవీ) పై చాలా దెబ్బపడింది.

ఇలాంటి తరుణంలో ఇన్వెస్టర్లు హై క్రెడిట్ క్వాలిటీ కలిగిన డెట్ ఫండ్ క్యాటగిరీలపై ద్రుష్టి సారించాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఓవర్ నైట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, మనీ మార్కెట్ ఫండ్స్, కార్పొరేట్ బాండ్ ఫండ్స్, బ్యాంకింగ్, పీ ఎస్ యు డెట్ ఫండ్స్ ను పరిశీలించాలని కోరుతున్నారు.

ఇదీ ముఖ్యం..

ఇదీ ముఖ్యం..

డెట్ స్కీమ్స్ ను ఎంచుకునే వారు విభిన్న రకాల డెట్ సాధనాల్లో కేటాయింపులు జరిపిన డెట్ పథకాలను ఇన్వెస్టర్లు ఎంచుకోవాలి. దీని ద్వారా వారికి ఎదురయ్యే రిస్క్ తగ్గడానికి అవకాశం ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు.

వీటిలో రిస్క్ ఇంకా తక్కువ..

వీటిలో రిస్క్ ఇంకా తక్కువ..

* డెట్ ఫండ్స్ లో తక్కువ రిస్క్ ఉండేవి ఓవర్ నైట్ ఫండ్స్ గా చెబుతారు.

* వీటి పెట్టుబడులు రేపో, ట్రై పార్టీ రేపో, సర్టిఫికెట్స్ అఫ్ డిపాజిట్ (సీడీ), కమర్షియల్ పేపర్స్, ట్రెజరీ బిల్స్, కాష్ మేనేజ్మెంట్ బిల్స్ వంటివి ఉంటాయి.

* ఈ ఫండ్స్ తక్కువ క్రెడిట్ రిస్క్ కలిగి ఉంటాయి. ఎందుకంటే వీటిలో డీఫాల్ట్ రిస్క్ తక్కువగా ఉంటుంది. ఒక రోజు మెచ్యూరిటీ ఉండటం వల్ల వడ్డీ రేటు రిస్క్ దాదాపు ఉండదంటున్నారు.

లిక్విడ్ ఫండ్స్..

లిక్విడ్ ఫండ్స్..

* డెట్, మనీ మార్కెట్ సెక్యూరిటీల్లో లిక్విడ్ ఫండ్స్ పెట్టుబడి

* ట్రై పార్టీ రేపో, 'సర్టిఫికెట్స్ అఫ్ డిఫాజిట్స్, కమర్షియల్ పేపర్స్ లో పెట్టుబడి

* మిగులు నగదు లేదా అత్యవసర నిధి కోసం దాచుకున్న మొత్తాన్ని ఈ ఫండ్స్ లో పెట్టుబడిగా పెట్టవచ్చు. వీటిలో పెట్టుబడి వల్ల బ్యాంక్ డిపాజిట్లకన్నా ఎక్కువగానే ప్రయోజనం కలుగుతుందని విశ్లేషకులు సలహా ఇస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+