బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం మార్కెట్‌లో పసిడి ధర 24 క్యారెట్ల బంగారం రూ.20 పెరిగి రూ.39,400కు చేరుకుంది. గ్లోబల్ మార్కెట్లో బలహీనమైన ట్రెండ్ ఉన్నా కూడా దేశీయ జ్యువెల్లర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పెరగడం బంగారం ధరపై సానుకూల ప్రభావం చూపించిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.20 పెరిగి రూ.36,120 వద్ద ఉంది. గత కొద్ది నెలలుగా బంగారం ధరలు పెరుగుతూ, తరుగతూ వస్తోన్న విషయం తెలిసిందే. రెండు నెలల్లోనే బంగారం ధర దాదాపు రూ.32వేల నుంచి ఏకంగా రూ.40 వేలకు చేరువైంది. ఆ తర్వాత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో క్రమంగా వందల్లో తగ్గుతూ వచ్చింది. హైదరాబాదులో రూ.33వేలుగా ఉన్న బంగారం నెల రెండు నెలల్లో రూ.40వేలకు చేరి ఆ తర్వాత తగ్గుతూ రూ.38వేలకు దిగి వచ్చింది. ఇప్పుడు రూ.39వేలకు పైగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర...
బంగారం ధర కొద్దిగా పెరగగా, వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. కిలో వెండి ధర రూ.50,070 వద్ద నిలకడగా ఉంది. నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడం వంటి వివిధ కారణాలతో వెండికి డిమాండ్ లేదు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో ధరలు దాదాపు అటు ఇటుగా ఇలాగే ఉన్నాయి. ఢిల్లీ మార్కెట్లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా ఉంది. రూ.38,100 వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.36,900గా ఉంది. కిలో వెండి రూ.50,070గా ఉంది.

ఔన్స్ బంగారం 1600 డాలర్లకు చేరుకోవచ్చు
భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు త్వరలో ఔన్సుకు 1600 డాలర్ల వరకు పెరగవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా - చైనా ట్రేడ్ టాక్స్, బలహీనమైన ప్రపంచ వృద్ధి, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కారణంగా బంగారం ధర పెరుగుతుందని భావిస్తున్నారు. మంగళవారం ఔన్స్ బంగారం 1540 డాలర్లుగా ఉంది. అంతకుముందు పలు సెషన్లలో బంగారం ధర పడిపోయింది. కానీ మంగళవారం పెరిగింది.

బంగారం ధరలు పెరగొచ్చు..
స్వల్పకాలిక విరామం అనంతరం బంగారం ధరలు మళ్లీ పెరిగేందుకు సిద్ధంగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. పెట్టుబడులకు స్వర్గదామంగా భావిస్తూ పసిడిని ఇప్పటికీ కొనుగోలు చేస్తున్నారని అంటున్నారు. బంగారం ర్యాలీ కొద్ది కాలం నిలిచినప్పటికీ, ఇది ఔన్స్ 1600 డాలర్లకు చేరుకుంటుందని చెబుతున్నారు. ఇందుకు అంతర్జాతీయ పరిణామాలు కారణం అంటున్నారు.

మన దేశంలో భారీగా పెరుగుతుందా?
మన దేశంలోను బంగారం ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలకు తోడు పండుగ సీజన్ వస్తోంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు ఎక్కువ పెరగవచ్చునని చెబుతున్నారు. దసరా, దీపావళి పండుగ సందర్భాల్లో భారత్‌లో సేల్స్ ఎక్కువగా ఉంటాయి. ఔన్స్ బంగారం 1600 డాలర్లకు చేరుకుంటే మన దేశంలోను భారీగా పెరగవచ్చునని చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications