ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రాంతాన్ని బట్టి ధరలు కిలో రూ.50 నుంచి రూ.80 వరకు ఉన్నాయి. ఢిల్లీ తదితర మార్కెట్లో కిలో రూ.70 నుంచి రూ.80 వరకు ఉండగా, హైదరాబాద్ మార్కెట్లో రూ.50 వరకు ఉంది. ఈసారి తక్కువ విస్తీర్ణంలో పంటకు తోడు వర్షాల కారణంగా మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో పంట నీట మునిగింది. దీంతో తగినంత సరఫరా లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ధరలు పెరుగుతున్నాయి.

ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు
ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పలు రాష్ట్రాల్లో ఉంచిన నిల్వలను డిమాండును బట్టి ఆయా ప్రాంతాలకు సరఫరా చేయాల్సిందిగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం నిల్వలపై పరిమితి విధించాలని యోచిస్తోందని చెబుతున్నారు.

ఎగుమతులను తగ్గించే చర్యలు
అలాగే, ఉల్లి ఎగుమతులను తగ్గించేందుకు కనీస ఎగుమతి ధరను పెంచింది. ఎగుమతి ప్రోత్సాహకాలను ఉపసంహరించింది. ఈ నేపథ్యంలో ఉల్లి ఎగుమతులు తగ్గుతున్నాయి.

రూ.22 నుంచి రూ.24 వరకు విక్రయం
ఢిల్లీ వంటి పలు ప్రాంతాల్లో ఉల్లి వినియోగదారుల కంట నీరు తెప్పిస్తోంది. ఈ నేపథ్యంలో నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్, మదర్ డైరీల ద్వారా కిలో రూ.22 నుంచి రూ.24కు విక్రయించేలా ఏర్పాట్లు చేసింది.

ఉల్లి ధర పెరగడానికి కారణమిది కూడా....
ఉల్లి ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. సరఫరాను మెరుగుపరిచి ధరలను సాధారణ స్థాయికి తెచ్చేందుకు గత కొన్ని వారాలుగా కేంద్రం చర్యలు చేపట్టిందని, అయితే ప్రధానంగా ఉల్లిసాగు చేసే రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురువడం వల్ల గత రెండు మూడు రోజుల్లో ఉల్లి ధరలు అమాంతం పెరిగాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఉల్లిని ఎక్కువగా సాగు చేసే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్‌లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఉల్లి ధరలు పెరగడానికి అసలు కారణం ఇదీ!
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాయితీలకు కోత వేయడం, కనీస ఎగుమతి ధర పెంపు ద్వారా ఇతర దేశాలకు జరుగుతున్న ఎగుమతులకు చెక్ పెడుతోంది. అయితే దేశంలో తగినన్ని ఉల్లి నిల్వలు ఉన్నాయని, వర్షాకాలం కారణంగా వాటి సరఫరా నిలిచిపోయిందని, దీంతో మార్కెట్లో ధరలకు రెక్కలు వచ్చాయని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నిల్వ ఉంచిన ఉల్లిని విక్రయిస్తున్నామని, వర్షాకాల పంట దిగుబడులు నవంబర్ నెల మధ్య నుంచి మార్కెట్‌కు చేరుకుంటాయని చెబుతున్నారు. అప్పుడు మరింతగా తగ్గుతాయంటున్నారు.

గత ఏడాది రూ.10 ఇప్పుడు రూ.45
ప్రభుత్వం వద్ద ఉన్న నిల్వల్ని నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్ ద్వారా సరఫరా చేస్తోంది. వాటిని కిలో రూ.22కు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ రంగ మదర్ డైరీల్లో రూ.24కు విక్రయిస్తున్నారు. కేంద్రం వద్ద 56 వేల టన్నుల ఉల్లి నిల్వలు ఉన్నాయి. ఇప్పటివరకు 16 వేల టన్నులను సరఫరా చేశారు. ఒక్క ఢిల్లీలో రోజుకు 200 టన్నుల ఉల్లి దిగుమతి అవుతోంది. ఉల్లిగడ్డకు హోల్‌సేల్ మార్కెట్ మహారాష్ట్రలోని లాసల్గావ్. ఇక్కడ కిలో ఉల్లి ధర రూ.45గా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో రూ.10 కంటే తక్కువగా ఉంది. తమతమ రాష్ట్రాల్లోని కేంద్రం ఆధీనంలోని ఉల్లి నిల్వలను పెంచుకునేందుకు పలు రాష్ట్రాలు ఆసక్తి కనబరుస్తున్నాయట.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications