For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పోలవరం ప్రాజెక్టుకు, విద్యుత్ బస్సుల కొనుగోలుకు లింక్ పెట్టడమా?

|

పోలవరం రివర్స్ టెండరింగ్ పైన తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిపై ఆత్మరక్షణలో పడింది. ఈ నేపథ్యంలో టీడీపీకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది. పోలవరం రివర్స్ టెండరింగ్ ఘన విజయంతో టీడీపీ దిక్కుతోచని స్థితిలో పడిందని, తమను తాము కాపాడుకునేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకు అర్థంపర్థం లేని ఆరోపణలకు దిగుతోందని వైసీపీ అంటోంది.

టీడీపీ పొంతనలేని, దిగజారుడు ఆరోపణలకు దిగుతోందని చెబుతున్నారు. దీంతో ఏపీలో పెట్టుబడుల వాతావరణాన్ని మరింతగా దిగజారుస్తోందని విమర్శిస్తున్నారు. టీడీపీ తమ వారికి చెందిన కంపెనీ ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా, అధికార పార్టీ ప్రతీ చర్యను, ప్రతీ కాంట్రాక్టును విమర్శించడం ప్రారంభించిందని అంటున్నారు. అందులో భాగంగానే మేఘా కృష్ణారెడ్డి, ఆయన గ్రూపు సంస్థలపై విరుచుకుపడుతున్నాయని అంటున్నారు. మరోసారి క్విడ్ ప్రోకో ఆరోపణల అస్త్రాన్ని బయటకి తీసిందని అంటున్నారు.

జగన్ రూ.58 కోట్లు ఆదా చేశారా? సేవింగ్ పేరుతో రూ.32,000 కోట్ల బెనిఫిట్!!జగన్ రూ.58 కోట్లు ఆదా చేశారా? సేవింగ్ పేరుతో రూ.32,000 కోట్ల బెనిఫిట్!!

Is Jagan Government saved money through reverese tendering?

ఇంతవరకు పోలవరం ప్రాజెక్టులో ఒక్క పనిని కూడా మేఘా ఇంజినీరింగ్ కు కట్టబెట్టకుండానే, ప్రధాన పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ మొదలు కాకుండానే మొత్తం పోలవరం ప్రాజెక్టును మేఘా ఇంజినీరింగ్‌కు కట్టబెడుతున్నారంటూ టీడీపీ సీనియర్ నాయకులంతా కట్టకట్టుకుని, పోలవరం ప్రాజెక్టుతో పాటు విద్యుత్ బస్సుల కొనుగోలు వ్యవహారం పైనా ఆరోపణలు కురిపిస్తున్నారని అంటున్నారు.

English summary

పోలవరం ప్రాజెక్టుకు, విద్యుత్ బస్సుల కొనుగోలుకు లింక్ పెట్టడమా? | Is Jagan Government saved money through reverese tendering?

Andhra Pradesh Irrigation Minister P Anil Kumar said on Saturday that thousands of crores of public money would be saved through the reverse tendering process of the projects bidded under TDP government.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X