For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వినియోగదారుల క్రెడిట్ డేటా పై ఆర్బీఐ ఆంక్షలు! ఎందుకో తెలుసా?

|

వినియోగదారుల క్రెడిట్ డేటాకు సంబంధించి భారత రిజర్వ్ బ్యాంక్ సరికొత్త ఆంక్షలు విధించింది. వీటి ప్రకారం క్రెడిట్ బ్యూరోలవద్ద ఉన్న వినియోగదారుల సమాచారాన్ని అనియంత్రిత సంస్థలు పొందకుండా వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీలు చర్యలు తీసుకోవాలి. అంటే సమాచారాన్ని అందించడం నిలిపి వేయాలి.

ఏజెంట్లను నియమించి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలనుంచి డేటా బేస్ ను పొందడానికి అనుమతిచ్చినట్టు ఆర్ బీ ఐ గుర్తించింది. ఇలాంటి చర్యలు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ (రెగ్యులేషన్) చట్టం లోని నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. ఆర్ధిక సంస్థలు తమ ఆదేశాలను గనక ధిక్కరిస్తే జరిమానా తప్పదని హెచ్చరించింది. ఇలాంటి చర్యలను కట్టడి చేయడానికి బ్యాంకులు తీసుకున్న చర్యలను 15 రోజుల్లో తెలియజేయాలని ఆదేశించింది.

RBI restricts access to credit data of consumers

ఫిన్ టెక్ స్టార్ట్అప్స్ కు దెబ్బ

* భారత రిజర్వ్ బ్యాంకు విధించిన తాజా ఆంక్షల వల్ల ఫిన్ టెక్ స్టార్ట్ అప్స్ పై ప్రభావం పడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
* ఈ సంస్థలు వినియోగదారుల క్రెడిట్ సమాచారం ఆధారంగానే తమ వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.
* పీ ఎస్ బీ లోన్స్ ఇన్ 59 మినిట్స్ ప్లాటుఫామ్ కార్యకలాపాలపై కూడా ప్రభావం ఉంటుందని అంటున్నారు.
* అయితే ఎన్ బీ ఎఫ్ సి లైసెన్స్ పొందిన స్టార్ట్ అప్స్ లేదా ఆన్ లైన్ రుణ వితరణ సంస్థలకు మాత్రం ఇబ్బంది ఉండదని

బ్యాంకులు, ఎన్ బీ ఎఫ్ సీ లు ఏం చేస్తున్నాయంటే...

* క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం బ్యాంకులు, ఎన్ బీ ఎఫ్ సి లు ప్రతి రిటైల్ రుణానికి సంబంధించిన సమాచారాన్ని తప్పని సరిగా నాలుగు క్రెడిట్ బ్యూరోలకు తెలియజేయాల్సి ఉంటుంది.
* వినియోగదారులు తాము తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లిస్తున్న దాన్ని బట్టి ఈ సమా చారాన్ని అప్ డేట్ చేయాల్సి ఉంటుంది.
* ఈ సమాచారం ఆధారంగా ఇతర బ్యాంకులు ఎవరైనా కస్టమర్లకు రుణం మంజూరు చేసే ముందు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.
* ప్రస్తుతం బ్యాంకులు.. ఫిన్ టెక్ సంస్థలు, ఇనిస్టిట్యూషనల్ ఏజెంట్లతో చేతులు కలిపి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల నుంచి నేరుగా సమాచారాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ విషయంలో కస్టమర్ల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోవడం లేదు.
* ఆర్ బీ ఐ తాజా ఆదేశాల నేపథ్యంలో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలైన ట్రాన్స్ యూనియన్ సిబిల్, ఈక్విఫాక్స్, ఎక్స్పీరియన్ , సి ఆర్ ఐ ఎఫ్ హై మార్క్ సారధులతో ఆర్ బీ ఐ ప్రతినిధులు సమావేశమయ్యారు. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాల గురించి తెలుసుకున్నారు.

English summary

వినియోగదారుల క్రెడిట్ డేటా పై ఆర్బీఐ ఆంక్షలు! ఎందుకో తెలుసా? | RBI restricts access to credit data of consumers

The Reserve Bank of India has ordered commercial banks and non-banking lenders to stop providing unregulated entities access to consumer data held by credit bureaus, dealing a blow to scores of fintech startups that have based their business models on such information.
Story first published: Saturday, September 21, 2019, 18:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X