For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముందే వచ్చిన దీపావళి, గంటలో రూ.5 లక్షల కోట్లు పెరిగిన సంపద

|

ముంబై: ఇన్వెస్టర్లకు దీపావళి పండుగ ముందే వచ్చింది! FPIలకు, కార్పోరేట్ సెక్టార్‌కు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బెనిఫిట్స్ ప్రకటించిన నేపథ్యంలో మార్కెట్లు జోరుమీద కనిపించాయి. దీంతో కేవలం గంటలోనే ఇన్వెస్టర్ల సంపద రూ.5 లక్షల కోట్లకు పైగా పెరిగింది.

డేటా వివరాల ప్రకారం బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.143.45 లక్షల కోట్లకు పెరిగింది. నిర్మలా సీతారామన్ ప్రకటనకు ముందు.. అంటే గురువారం నాటికి వీటి ఎం-క్యాప్ రూ.138.54 లక్షల కోట్లుగా ఉంది. కానీ శుక్రవారం ఆర్థికమంత్రి ప్రకటన అనంతరం సెన్సెక్స్ ఏకంగా 2,000 పాయింట్లకు పైగా ఎగబాకింది. దీంతో బీఎస్ఈ ఎం-క్యాప్ రూ.143 లక్షల కోట్లకు పెరిగింది. అంటే కేవలం గంటలో ఇన్వెస్టర్ల సంపద రూ.5 లక్షల కోట్లకు పైగా పెరిగింది. నిఫ్టీ కూడా భారీగానే లాభపడింది.

హోమ్ లోన్, ఎంఎస్ఎంఈలకు శుభవార్త, 400 జిల్లాల్లో లోన్ మేళాహోమ్ లోన్, ఎంఎస్ఎంఈలకు శుభవార్త, 400 జిల్లాల్లో లోన్ మేళా

Diwali comes early: D Street spins Rs 5 lakh cr wealth within an hour

బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరబుల్, ఆటో కంపెనీల షేర్లు భారీగా లాభాలు మూట కట్టుకున్నాయి. కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు కార్పోరేట్ ట్యాక్స్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కూడా జోరు అందుకుంది. అన్ని రంగాల షేర్లు ఊపందుకుంటాయని, తయారీ రంగం కూడా ఆకర్షణీయంగా మారుతుందని కార్వీ స్టాక్ బ్రోకింగ్ సీఈవో రాజీవ్ సింగ్ అన్నారు.

English summary

ముందే వచ్చిన దీపావళి, గంటలో రూ.5 లక్షల కోట్లు పెరిగిన సంపద | Diwali comes early: D Street spins Rs 5 lakh cr wealth within an hour

The tax bonanza by the Finance Minister Nirmala Sitharaman to FPIs and corporate sector gave Dalal Street investors Rs.5 lakh crore lift within hour on Friday.
Story first published: Friday, September 20, 2019, 14:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X