భారీ నష్టాల్లో మార్కెట్లు: 500 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
ముంబై: భారత మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించిన నేపథ్యంలో తదుపరి కోత ఇప్పుట్లో ఉండకపోవచ్చుననే అభిప్రాయం మార్కెట్లపై పడింది. మధ్యాహ్నం గం.3.30 సమయంలో సెన్సెక్స్ 470.41 (1.29%) పాయింట్లు నష్టపోయి 36,093.47 వద్ద, నిఫ్టీ 144.30 (1.33%) పాయింట్లు కోల్పోయి 10,696.35 వద్ద ట్రేడ్ అయింది. ఓ సమయంలో సెన్సెక్స్ 500 పాయింట్లు కూడా నష్టపోయింది. మధ్యాహ్నం 3 గంటలకు డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు బలపడి 71.15 వద్ద ట్రేడ్ అయింది.
యస్ బ్యాంకు, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ షేర్లు కుదేలయ్యాయి. విదేశీ పెట్టుబడులు నిరంతరంగా వెనక్కి మరలడం మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీసింది. వీటికి ఫెడ్ వడ్డీ రేట్లు కూడా ప్రభావం చూపాయి. ఫలితంగా ఎక్కువ సూచీలు నష్టాల్లోకి జారిపోయాయి.

నిఫ్టీలో ఆటో, బ్యాంకింగ్, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రా, ఐటీ, మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకులు.. ఇలా అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. బీఎస్ఈలో దాదాపు 100 షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. జీ ఈఎన్టీ, టాటా స్టీల్ 4-7 శాతం వరకు నష్టపోయింది.


Click it and Unblock the Notifications