For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.2,300 తగ్గిన బంగారం ధర, రూ.5,000 తగ్గిన వెండి ధర!

|

న్యూఢిల్లీ: బంగారం ధరలు వరుసగా మూడో రోజు తగ్గాయి. యూఎస్ ఫెడ్ కట్ పాలసీ 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో ఈ ప్రభావం బంగారం పైన పడింది. యూఎస్ ఫెడ్ రేట్ తగ్గింపు నేపథ్యంలో గురువారం ఉదయం పసిడి ధరలు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత తగ్గాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.37,600గా ఉంది. వెండి కిలో ధర రూ.46,200గా ఉంది. బుధవారం బంగారం ధర 0.5 శాతం తక్కువకు క్లోజ్ అయింది.

నెలకు రూ.1,500 జీతం,ఇప్పుడు KBCలో రూ.1 కోటి గెలిచిన వంటమనిషినెలకు రూ.1,500 జీతం,ఇప్పుడు KBCలో రూ.1 కోటి గెలిచిన వంటమనిషి

తగ్గిన బంగారం ధర

తగ్గిన బంగారం ధర

ఇటీవల సౌదీ అరేబియాలో రెండు చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడి నేపథ్యంలో క్రూడాయిల్ ధర పెరిగింది. అయితే త్వరలో ఈ సమస్య కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. తొలుత దాడి జరిగినప్పుడు ఇన్వెస్టర్లు బంగారం వైపు చూశారు. అయితే రానున్న రోజుల్లో క్రూడాయిల్ మార్కెట్ సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారం తిరోగమనం చవిచూస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 0.3 శాతం తగ్గి 1,489.73 డాలర్లుగా ఉంది.

రూ.2,300 తగ్గిన బంగారం

రూ.2,300 తగ్గిన బంగారం

బంగారం ధరలు వరుసగా మూడు రోజుల పాటు పడిపోయాయి. గత నెలలో బంగారం ధర రూ.39,885 రికార్డ్ స్థాయికి చేరుకుంది. ఇటీవల వరుసగా తగ్గడంతో ఆ రికార్డ్ హైతో పోలిస్తే ఏకంగా రూ.2,300 తగ్గింది. అలాగే, వెండి ధర రూ.5,000 వరకు తగ్గింది.

10 గ్రాముల బంగారం ఏ నగరంలో ఎంత?

10 గ్రాముల బంగారం ఏ నగరంలో ఎంత?

చెన్నై 22 క్యారెట్ల బంగారం ₹35,790, 24 క్యారెట్ల బంగారం ₹39,040, ముంబైలో 22 క్యారెట్ల బంగారం ₹36,500 24 క్యారెట్ల బంగారం ₹37,500, న్యూఢిల్లీ 22 క్యారెట్ల బంగారం ₹36,550, 24 క్యారెట్ల బంగారం ₹37,660, కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ₹36,880, 24 క్యారెట్ల బంగారం ₹38,130, బెంగళూరు 22 క్యారెట్ల బంగారం ₹35,150, 24 క్యారెట్ల బంగారం ₹38,340గా ఉంది.

హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో ధర...

హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో ధర...

హైదరాబాద్ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ₹35,790, 24 క్యారెట్ల బంగారం ₹39,040, విజ‌య‌వాడ‌ 22 క్యారెట్ల బంగారం ₹35,790, 24 క్యారెట్ల బంగారం ₹39,040, సూర‌త్ 22 క్యారెట్ల బంగారం ₹36,750, 24 క్యారెట్ల బంగారం ₹37,530, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ₹35,790, 24 క్యారెట్ల బంగారం ₹39,040గా ఉంది. బంగారం ధరలు దాదాపు నెల రోజుల క్రితం ధరలో ఉన్నాయి.

English summary

రూ.2,300 తగ్గిన బంగారం ధర, రూ.5,000 తగ్గిన వెండి ధర! | Gold rate today: Gold prices fall for third day, down Rs.2300 from highs

Precious metals opened flat but drifted lower in the opening trade on Thursday after the US Fed bank cut policy rates by 25 basis points.
Story first published: Thursday, September 19, 2019, 15:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X