For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్‌న్యూస్: LED, LCD టీవీల ధరలు తగ్గనున్నాయి

|

టీవీల రేట్లు తగ్గనున్నాయి! కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం గుడ్ న్యూస్ చెప్పారు. ఓపెన్ సెల్ ఎల్ఈడీ టీవీ ప్యానల్స్ పైన దిగుమతి సుంకాన్ని ఎత్తివేస్తున్నట్లు ఆర్థికమంత్రి వెల్లడించారు. 5 శాతం ఇంపోర్ట్ డ్యూటీని రద్దు చేశారు. దీంతో ఇంపోర్ట్ డ్యూటీ ఏమీ ఉండదు. దీంతో టీవీ తయారీ ధరలు మూడు శాతం వరకు తగ్గుతాయని చెబుతున్నారు. దీంతో టీవీల ధరలు కూడా తగ్గనున్నాయి.

డెబిట్ కార్డు కంటే క్రెడిట్ కార్డు చాలా భద్రం, ఎందుకో తెలుసాడెబిట్ కార్డు కంటే క్రెడిట్ కార్డు చాలా భద్రం, ఎందుకో తెలుసా

దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో దేశీయ మార్కెట్లో ఎల్ఈడీ, ఎల్‌సీడీ టీవీల ధరలు కాస్త తగ్గుముఖం పట్టనున్నాయి. ఓపెన్ సెల్ టీవీ ప్యానళ్లను ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ టీవీల తయారీలో ఉపయోగిస్తుంటారు.

 Finance ministry scraps import duty on open cell LED TV panel

దీంతో పాటు ఫిల్మ్ చిప్స్, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు అసెంబ్లీ, సెల్ వంటి పరికరాలపై కూడా ఇంపోర్ట్ డ్యూటీని ఎత్తివేసింది. వీటిని ఓపెన్ సెల్ టీవీ ప్యానల్స్ తయారీలో వినియోగిస్తారు.

టీవీల తయారీకి అయ్యే ఖర్చులో దాదాపు సగానికి పైగా ఈ ప్యానల్స్‌కు అవుతుంది. వీటిపై దిగుమతి సంకాలను తగ్గించిన నేపథ్యంలో టీవీల ధరలు దిగివస్తాయని నిపుణులు చెబుతున్నారు.

English summary

గుడ్‌న్యూస్: LED, LCD టీవీల ధరలు తగ్గనున్నాయి | Finance ministry scraps import duty on open cell LED TV panel

The ministry of finance has scrapped the import duty on open cell LED TV panel from 5% to zero in a late night notification issued on Tuesday.
Story first published: Wednesday, September 18, 2019, 17:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X