ఈ కార్లపై రూ.1.5 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు భారీ డిస్కౌంట్!
పండుగల సీజన్ ప్రారంభమైంది. ఇలాంటి సమయంలో సాధారణ వ్యాపారుల నుంచి ఈ-కామర్స్ వెబ్ సైట్స్ వరకు భారీ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తారు. ఇటీవల ఆటోమొబైల్ సేల్స్ భారీగా తగ్గిపోయిన విషయం తెలిసిందే. ఈ ఫెస్టివల్ సీజన్‌లో ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ కూడా ఇటీవల భారీ ఆఫర్ ప్రకటించింది.

ఏ కారుపై ఎంత డిస్కౌంట్ అంటే?
Nexon, Hexa, Tiago, Tiago NRG, Tigorతో పాటు ఇటీవలే లాంచ్ చేసిన Harrier వంటి మోడల్ కార్లపై పండుగ ఆఫర్‌గా రూ.1.5 లక్షల డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. టాటా Hexa పైన రూ.1,50,000, Nexon పైన రూ.85,000, Tiago పైన రూ.70,000, Tiago NRG పైన రూ.65,000, Tigor పైన రూ.1,15,000, Harrier పైన రూ.50,000 ప్రయోజనాలు ఇస్తోంది.

ఫెస్టివల్ కార్స్ కంపెయిన్ కింద భారీ డిస్కౌంట్
ఫెస్టివల్ కార్స్ కంపెయిన్ కింద టాటా మోటార్స్ కొత్త కస్టమర్లకు ఈ భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అదే సమయంలో పాత కార్లను కొత్త కార్లతో మార్చుకునే వారికి కూడా ఆఫర్లు ఇస్తోంది.

ఆర్థిక సాయం కోసం బ్యాంకులతో ఒప్పందం, తక్కువ ఈఎంఐ
మరో విషయం ఏమంటే ప్రభుత్వరంగ ఉద్యోగులకు, కార్పోరేట్ రంగ ఉద్యోగులకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. కార్లను కొనుగోలు చేసే వారికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసం టాటా మోటార్స్ వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. 100 శాతం వరకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుంది. ఈ దీపావళి పండుగ సీజన్ సేల్స్‌లో భాగంగా తక్కువ EMI ప్యాకేజీని కూడా అందిస్తోంది.

పండుగ ఎంతో కీలకం..
ఫెస్టివ్ సీజన్ తమకు ఎంతో కీలకమని, తమ కస్టమర్లకు వివిధ ప్రయోజనాలు అందిస్తూ వారి సంబరాల్లో భాగస్వామ్యం అవుతున్నామని, ఓనమ్, గణేష్ చతుర్థి నుంచి డిమాండ్ పుంజుకుందని, ఇప్పుడు పండుగ సీజన్ ప్రారంభమైందని, ఈ నేపథ్యంలో సేల్స్ ప్రోత్సాహకరంగా ఉంటాయని ఆశిస్తున్నామని టాటా మోటార్స్ తెలిపింది.

రూ.4,00,000 వరకు క్యాష్ డిస్కౌంట్ ఆఫర్
మారుతి సుజుకీ కూడా పండుగ సందర్భంగా ఆఫర్లు ప్రకటించింది. హోండా కారు ఇండియా సివిక్ పైన రూ.2.5 లక్షలు, CR-V పైన రూ.4 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. Amaze కారు పైన రూ.42,000 వరకు డిస్కౌంట్ ఇస్తోంది. సివిక్ కారు పైన రూ.2.5 లక్షల వరకు ఇస్తోంది. ఇక హోండా CR-V డీజిల్ పైన అతిపెద్ద ఆఫర్ ఇస్తోంది. రూ.4,00,00 వరకు క్యాష్ డిస్కౌంట్ ఇస్తోంది.


Click it and Unblock the Notifications