భారీ నష్టాల్లో మార్కెట్లు: 650 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్, 10,850 దిగువన నిఫ్టీ
ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఉదయం నుంచే నష్టాలను మూటగట్టుకున్నాయి. ఉదయం గం.9.22 నిమిషాలకు సెన్సెక్స్ 100 పాయింట్ల నష్టంతో 37,023 వద్ద, నిఫ్టీ 28 పాయింట్లు కోల్పోయి 10,975 వద్ద ట్రేడ్ అయింది.
సాయంత్రం గం.2.30 సమయానికి భారీగా కోల్పోయింది. 582.32 (1.57%) నష్టపోయి 36,540.99 వద్ద, నిఫ్టీ 167.65 (1.52%) పాయింట్లు కోల్పోయి 10,835.85 వద్ద ట్రేడ్ అయింది. మధ్యాహ్నం ఓ సమయంలో సెన్సెక్స్ ఏకంగా 650 పాయింట్లు కోల్పోయింది. ఇక నిఫ్టీ అయితే 10,850 పాయింట్లకు దిగువన ట్రేడ్ అయింది.

ఆటో, ఐటీ, ఇన్ఫ్రా, పార్మా, బ్యాంకు, ఎనర్జీ, మెడికల్ ఇలా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. అమెరికా ఫెడ్ సమావేశం, ఇరాన్‌తో యుద్ధ భయాల ప్రభావం మార్కెట్‌పై పడుతోంది.
డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా 71.88కి కోల్పోయింది. హీరో మోటో కార్ప్ షేర్లు 4.4 శాతం, యాక్సిస్ బ్యాంకు షేర్లు 3.75 శాతం, ఐసీఐసీఐ, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, టాటా స్టీల్, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్ టెల్ వంటి షేర్లు 2 శాతం నుంచి 3 శాతం కోల్పోయాయి.
నిన్న వాల్ స్ట్రీట్ కూడా 0.5 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 0.3 శాతం కుంగిపోయింది. ఆసియా మార్కెట్లు నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. జపాన్ సూచీ 0.1 శాతం, ఆస్ట్రేలియా సూచీ 0.18 శాతం నష్టపోయింది. మంగళవారం ఉదయం కూడా చమురు సూచీలు 1 శాతం మేర తగ్గాయి.


Click it and Unblock the Notifications