గోల్డ్ ప్రోగ్రామ్ అంశంపై జొమాటోకు, ఎన్ఆర్ఏఐకు (నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా-NRAI) కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఇది కొలిక్కి రావడం లేదు. జొమాటో గోల్డ్ ఆమోదయోగ్యం కాదని NRAI చెబుతోంది. ప్రస్తుతానికి జొమాటో తన ఈ ఆఫర్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. దీనిపై NRAI చర్చలు జరుగుతున్నాయి. కానీ NRAI నో చెబుతోంది.
ఇలాంటి ఆఫర్లపై చర్చించేందుకు డెలివరీ అగ్రిగేటర్లు స్విగ్గీ, జొమాటోలతో చర్చిస్తున్నట్లు NRAI ప్రెసిడెంట్ అనురాగ్ కత్రియార్ అన్నారు. ఈ వారంతంలో అగ్రిగేటర్లతో రెండోసారి సమావేశమయ్యామని, ఆన్ లైన్ డెలివరీకి సంబంధించి ఎనిమిది క్లిష్టమైన అంశాలపై ఆగస్ట్ 29న జరిగిన చర్చలకు ఇవి కొనసాగింపు అన్నారు. ఈ అంశాలు ఫుడ్ సర్వీస్ ఇండస్ట్రీని నిర్వీర్యం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా, స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ అగ్రిగేటర్లు ఇస్తున్న భారీ ఆఫర్లకు రెస్టారెంట్లు మాత్రం నో చెబుతున్నాయి. ఇలా భారీ డిస్కౌంట్లు ఇవ్వలేమని వెల్లడిస్తున్నాయి. ముందు రెస్టారెంట్ల మాట వినని అగ్రిగేటర్లు ఆ తర్వాత సమస్య పరిష్కరించుకునేందుకు ముందుకు వచ్చాయి. హోటళ్ యాజమాన్యాలు మాత్రం వెనక్కి తగ్గలేదు.
జొమాటో వంటి ఫుడ్ యాప్స్.. ప్రత్యేక మెంబర్ షిప్ తీసుకున్న యూజర్లకు డైన్ ఇన్ ఆఫర్లు వంటివి... పెద్ద రెస్టారెంట్లు, చిన్న హోటల్స్ మధ్య పోరుగా కూడా మారుతోంది. ఈ నేపథ్యంలో పలు రెస్టారెంట్లు లాగవుట్ ఉద్యమానికి తెరలేపాయి. ఫుడ్ యాప్స్.. అగ్రిగేటర్ల నుంచి తప్పుకున్నాయి. ఇందుకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications