ముంబై: భారత మార్కెట్లు సోమవారం నాడు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సౌదీ అరేబియాలోని ఆరామ్కో చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడి నేపథ్యంలో ఈ ప్రభావం మన మార్కెట్లపై పడింది. క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో 13 శాతం వరకు పెరిగాయి. దీంతో మన మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి.
ఉదయం గం.9.40 నిమిషాలకు సెన్సెక్స్ 266 పాయింట్లు నష్టపోయి 37,118 వద్ద, నిఫ్టీ 82 పాయింట్లు నష్టపోయి 10,992 వద్ద ట్రేడ్ అయింది. మధ్యాహ్నం గం.12.00 సమయానికి సెన్సెక్స్ 158.04 (0.42%) శాతం తగ్గి 37,226.95 వద్ద ట్రేడ్ కాగా, నిఫ్టీ 47.70 (0.43%) కోల్పోయి 11,028.20 వద్ద ట్రేడ్ అయింది.డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.58 వద్ద ట్రేడ్ అయింది.

నిఫ్టీలో... ONGC 2.44%, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 2.36%, GAIL 1.78%, టెక్ మహీంద్రా 0.75%, డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్ 0.75% లాభపడగా, భారత్ పెట్రోలియం 5.52%, ఇండియన్ ఆయిల్ 2.77%, ఆసియన్ పేయింట్స్ 2.19%, భారతి ఇన్ఫ్రాటెల్ 1.83%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.64% నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.
సెన్సెక్స్‌లో ONGC 2.29%, టెక్ మహీంద్రా 0.80%, టీసీఎస్ 0.74%, హిందూస్తాన్ యూనీలివర్ 0.73%, సన్ ఫార్మా 0.53% లాభాల్లో ట్రేడ్ కాగా, ఆసియన్ పేయింట్స్ 2.31%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.49%, హెచ్డీఎఫ్సీ 1.34%, టాటా మోటార్స్ 1.08%, మారుతీ సుజుకీ 0.97% నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications