న్యూఢిల్లీ: 2019 సంవత్సరం ముగియడానికి ఇంకా మూడున్నర నెలలు మాత్రమే గడువు ఉంది. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు వచ్చిన ఐపీవోలు కేవలం 11 మాత్రమే. ఈ సంస్థల నుంచి సమీకరించింది రూ.10,300 కోట్లు. తద్వారా ఈ ఏడాది ఐపీవో (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్) జోరు బాగా తగ్గినట్లుగా అర్థమవుతోంది. 2018 ఏడాదిలో మొత్తం 24 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు రాగా రూ.30,959 కోట్లు సమీకరించగా, ఇప్పుడు పడిపోయాయి.

పబ్లిక్ ఇష్యూలోకి వచ్చినా...
మార్కెట్లో అనిశ్చితి కారణంగా పబ్లిక్ ఇష్యూలోకి వచ్చినా సరైన స్పందన ఉండకపోవచ్చునని కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయని రిలయన్స్ సెక్యూరిటీస్ హెడ్ (రీసెర్చ్) నవీన్ తెలిపారు. స్మాల్, మిడ్ క్యాప్ కేటగిరీ షేర్లు భారీగా దిద్దుబాటుకు లోనయ్యాయని, ఇది ప్రాథమిక మార్కెట్ పైన ప్రభావం చూపిందన్నారు. 2017లో 36 ఐపీవోల ద్వారా రూ.68,000 కోట్లు సమీకరించగా, ఇది రికార్డ్.

మాంద్యం భయం
మార్కెట్ ఆటుపోట్ల మధ్య నడుస్తోందని, దీంతో రాబోయే మరికొన్ని నెలల్లో పరిస్థితి ఇలాగే ఉండవచ్చునని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఆర్థిక మాంద్యం భయాల కారణంగా మార్కెట్లు ఊగిసలాటలో ఉన్నాయని, ఈ ఏడాది ప్రారంభం నుంచి సుమారు పది శాతం వరకు సూచీలు నష్టపోయాయని, ఈ దెబ్బకు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి కార్పోరేట్ సంస్థలు కూడా వెనుకడుగు వేస్తున్నాయని చెబుతున్నారు.

ఐపీవో పక్కన పెడితే.. పెట్టుబడులు వెనక్కి..
ఆర్థికమాంద్యం భయం నేపథ్యంలో ఐపీవో అంశాన్ని పక్కన పెడితే వ్యాపార విస్తరణ కోసం పెట్టుబడులను కూడా వెనక్కి తీసుకుంటున్నాయని చెబుతున్నారు. రానున్న కొద్ది నెలలు ఐపీవో మార్కెట్ గడ్డు పరిస్థితులను ఎదుర్కోక తప్పదని చెబుతున్నారు.

పలు కారణాలు...
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో తిరోగమనంతో పాటు దేశీయంగా కూడా పరిస్థితులు సంక్లిష్టంగా మారటం స్టాక్ మార్కెట్‌ను ఆటుపోట్లలోకి నెట్టాయి. అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం రావణకాష్టంలా రగులుతోంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసింది. చైనా ఆర్థిక వ్యవస్థ కూడా తిరోగమనంలో ఉంది. రూపాయి విలువ తగ్గింది. వీటికి తోడు దేశీయంగా మార్కెట్ పరిస్థితులు నిరాశగా కనిపిస్తున్నాయి. మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడింది.

ప్రత్యామ్నాయ మార్గాల్లో సమీకరణ
ఏ కంపెనీ అయినా విస్తరణ ప్రణాళికలు, వర్కింగ్ కేపిటల్ అవసరాలు, రుణభారం తగ్గించుకోవడానికి మార్కెట్ నుంచి నిధులను సమీకరిస్తుంది. కానీ ప్రస్తుతం పరిస్థితులు ఆశాజనకంగా లేవనిచెబుతున్నారు. అందుకే పబ్లిక్ ఇష్యూల మార్కెట్ మందగమనంతో కొనసాగుతోందని చెబుతున్నారు. గత ఏడాది కాలంలో పబ్లిక్ ఇష్యూకు అనుమతి కోరుతూ 90 కంపెనీల వరకు సెబికి దరఖాస్తు చేశాయి. కానీ ఇష్యూకు వచ్చిన కంపెనీలు 10 శాతం కూడా లేవు. మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇష్యూకు వచ్చి ఇబ్బందులు పడటం కంటే ప్రత్యామ్నాయ మార్గాల్లో సమీకరించడం మంచిదని భావిస్తున్నాయి.

షేర్ల నమోదు ధర కంటే ఎక్కువ...
స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్, స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్, అఫిల్ ఇండియా, చాలెట్ హోటల్స్, రెయిల్ వికాస్ నిగమ్, మెట్రోపోలిస్ హెల్త్ కేర్, పాలిక్యాబ్ ఇండియా వంటి సంస్థలు ఈ ఏడాది ఐపీవోకు వచ్చాయి. ఆసక్తికర విషయం ఏమంటే ఇందులో పలు కంపెనీలు షేర్ల నమోదు ధర కంటే ఎక్కువే ట్రేడ్ అవుతున్నాయి. ఎస్బీఐ జనరల్ ఇన్సురెన్స్‌కు ప్రస్తుతానికి అదనపు మూలధనం అవసరం లేకపోవడంతో పబ్లిక్ ఇష్యూ ప్లాన్ నుంచి విరమించుకుంది.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications