ప్రభుత్వరంగ ఎయిరిండియా 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.4,600 కోట్ల నిర్వహణ నష్టాన్ని చవిచూసింది. ఇంధన ధరలు పెరగడానికి తోడు విదేశీ మారకపు ద్రవ్య విలువల్లో వచ్చిన మార్పు ఇందుకు కారణమని సంస్థ తెలిపింది. పెరిగిన ధర వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.700 నుంచి రూ.800 కోట్ల నిర్వహణ లాభాలు ఆర్జిస్తామని ఎయిరిండియా అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
గత ఆర్థిక సంవత్సరానికి గాను రూ.26,400 కోట్ల ఆదాయంపై రూ.8,400 కోట్ల నికర నష్టాలను ప్రకటించింది. ఇందులో నిర్వహణా నష్టం రూ.4,600 కోట్లు. అధిక ఇంధన ధరలు, డాలర్‌తో రూపాయి మారకం రేటు అంశాలు కలిసి వస్తే 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.700 కోట్ల నుంచి రూ.800 కోట్ల వరకు నిర్వహణ లాభాలు ఆర్జించే అవకాశముందని కూడా పేర్కొనడం గమనార్హం.

అయితే చమురు ధర 60డాలర్లకు తక్కువ ఉంటేనే ఇది సాధ్యమవుతుందని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి నాలుగు నెలల్లో ఎయిరిండియాకు నష్టాలు తప్పలేదు. దేశీయంగా 72 ప్రాంతాలకు, అంతర్జాతీయంగా 41 గమ్యస్థానాలను చేరవేస్తున్న ఎయిరిండియా 2019-20 తొలి త్రైమాసికంలో రూ.200 కోట్ల వరకు నిర్వహణ నష్టాన్ని చవిచూసింది. ఏప్రిల్-జూలై మధ్య కాలంలో కంపెనీ రూ.430 కోట్ల నికర నష్టాలు చవిచూసింది.
జెట్ విమానాలు రద్దు కావడం వల్ల సీట్ల భర్తీ పెరిగినా బాలాకోట్‌లో దాడుల తర్వాత తమ గగన మార్గంలో ప్రయాణానికి భారత్ విమానాలను పాకిస్తాన్ అనుమతించలేదు. దీంతో వేరేమార్గాల్లో వెళ్లేందుకు రోజుకు రూ.3 నుంచి రూ.4 కోట్ల అదనపు ఖర్చు అయింది.


Click it and Unblock the Notifications