చిన్న వ్యాపారాలు ప్రారంభించటం తేలికే. కానీ వాటిని విజయవంతంగా నడపటం కష్టం. అమ్మకాలు పెంచుకొంటేనే భవిష్యత్. లేదంటే మూసివేత ఖాయమే. పెద్దగా పెట్టుబడులు లేని ఇలాంటి వ్యాపారులు బిజినెస్ ను ప్రమోట్ చేసుకొనేందుకు పేపర్ పంపేల్ట్స్ పంచటం, ఫేస్బుక్ పేజీలో ప్రమోట్ చేసుకోవటం, లేదంటే సొంత వెబ్సైటు, మొబైల్ అప్ ద్వారా అమ్మకాలను పెంచుకొనే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా ఎంతో కొంత ఖర్చుతో కూడుకొన్న పనులే. డిజిటల్ మార్కెటింగ్ లోనూ ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ ప్లాటుఫార్మ్స్ కు ఇటీవల మరో సదుపాయం జోడయింది.
ఈ మధ్య చాలా మంది చిన్న వ్యాపారులు, ప్రారంభ దశలోని స్టార్టుప్ కంపెనీలు తమ వ్యాపారాలను ప్రమోట్ చేసుకొనేందుకు వాట్సాప్ బిజినెస్ ను వాడుతున్నాయి. ఇప్పటికే దేశంలోనూ, ప్రపంచంలోనూ వాట్సాప్ ఎంత పోపులరో తెలిసిందే కదా. అందుకే, ఈ ప్రముఖ యాప్ ఏడాది క్రితం ప్రవేశ పెట్టిన వాట్సాప్ బిజినెస్ యాప్ ను ఇప్పుడిప్పుడే మన దేశం లోని చిన్న వ్యాపారాలు వాడటం మొదలు పెడుతున్నారు. తద్వారా బిజినెస్ కూడా పెరుగుతోందని చెబుతున్నారు. ఈ యాప్ వాడకం కూడా పూర్తి ఉచితమే. పైగా వాడకం కూడా చాలా ఈజీగా ఉండేలా అభివృద్ధి చేశారు. కాకపోతే, దీని గురించి ఇంకా చాలా మందికి తెలియదు.

ల్యాండ్ లైన్ కూడా కనెక్ట్ చేయొచ్చు...
సాధారణంగా మనం వాట్సాప్ వాడాలంటే.. కేవలం మొబైల్ నెంబర్ తో దానిని అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ... వాట్సాప్ బిజినెస్ లో మాత్రం వ్యాపారులు వారి ల్యాండ్ లైన్ నెంబర్ తో కూడా అనుసంధామ్ చేసుకోవచ్చు. ఒక్క సారి ఈ నెంబర్ ను వాట్సాప్ బిజినెస్ కు వాడితే, ఇకపై ఎప్పుడైనా అదే నుమ్బెర్తో కార్యకలాపాలు కొనసాగించ వచ్చు. ఇందులో వ్యాపారులు, స్టార్టుప్ కంపెనీలు తమ ఉత్పత్తులను ఫోటోలు, వీడియోల రూపంలో ప్రమోట్ చేసుకోవచ్చు. వినియోగదారులు వాటిని కేవలం చూడటమే కాకుండా నేరుగా ఆర్డర్ చేసే సదుపాయం కూడా ఉంటుంది. మొదట్లో పేమెంట్ ఆప్షన్ కూడా లభించినా.. భారత్ లో వాట్సాప్ పేమెంట్స్ లైసెన్స్ తీసుకోలేదు కాబట్టి సేవలనుతాత్కాలికంగా నిలిపివేశారు. కానీ... బిజినెస్ కు సాఫ్ట్ వేర్ తో పనిలేకుండా... పూర్తి స్థాయి ఆర్డర్లను పర్యవేక్షించుకొనే అనేక ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి.

150 కోట్ల మంది యూజర్లు ...
ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ యాప్ ను సుమారు 150 కోట్ల మంది ఉపయోగిస్తున్నారు. యూసర్ ఫ్రెండ్లీ ఫీచర్స్ ఉండటంతో వినియోగం బాగా పెరిగింది. భారత దేశంలో ప్రస్తుతం దాదాపు 40 కోట్ల మంది వాట్సాప్ వాడుతున్నారు. అయితే, కొద్దీ కాలం క్రితమే ప్రారంభించిన వాట్సాప్ బిజినెస్ కూడా మెల్లగా ఆదరణ పెంచుకొంటోంది. ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షలకు పైగా చిన్న వ్యాపారులు, స్టార్టుప్ కంపెనీలు దీనిని వినియోగిస్తుండగా, భారత్ లో సుమారు 10 లక్షల మంది ఇంటర్ప్రెన్యూర్స్ దీనిని వాడకంలోకి తెచ్చారు. సులభమైన ఫీచర్స్, ఉచితంగా అధిక సంఖ్యలో వాట్సాప్ వినియోగదారులకు చేరుకొనే సదుపాయం ఉండటం, ప్రొడక్టులను నేరుగా ఆర్డర్ చేసే అవకాశంతో ఆదరణ పెరుగుతోంది.

ఆన్లైన్ సేల్స్ కు బెటర్...
ఇప్పటికే స్టోర్స్ ఉన్న బోటిక్ బిజినెస్ ఓనర్లు తమ ఉత్పత్తులను నేరుగా ఆన్లైన్ లో విక్రయించేందుకు వాట్సాప్ బిజినెస్ ఉపయోగపడుతుంది. చిన్న స్థాయి ఈ కామర్స్ స్టార్టుప్ కంపెనీలకు కూడా ఇది బాగా పనికొస్తుంది. ఇప్పటికే సొంత వెబ్సైటు, మొబైల్ యాప్ లు ఉన్న స్టార్టుప్ కంపెనీలకు ఇది అమ్మకాలను పెంచుకొనే సాధనంగా పనికొస్తుంది. ఆర్డర్లను స్వీకరించిన అనంతరం వాటిని నేరుగా డోర్ డెలివరీ చేసి బిజినెస్ కు పాపులారిటీ తెచ్చుకోవచ్చు. వాట్సాప్ బిజినెస్ ను మేనేజ్ చేయటం కూడా తేలికే. సాధారణ వాట్సాప్ వినియోగిస్తున్న ఎవరైనా దీనిని సులభంగా వినియోగించే సౌలభ్యం ఉంది. కాబట్టి దీనికోసమే ఒక ఉద్యోగిని నియమించుకోవాల్సిన అవసరం లేదు. ఉత్పత్తి మార్కెటింగ్ ఖర్చులు తగ్గుతాయి. పైగా ప్రమోషన్ ను డైరెక్ట్ సేల్ గా మార్చుకోవటం ఇందులోని ప్రత్యేకత.

12 కోట్ల మంది చిన్న వ్యాపారులు ...
వాట్సాప్ బిజినెస్ వాడకం కోసం కేవలం ఒక స్మార్ట్ ఫోన్, దానికి ఇంటర్నెట్ అనుసంధానత అవసరం. మన దేశంలో సుమారు 50 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఉన్నారు. అందులో దాదాపు 40 కోట్లకు పైగా వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. అదే సమయం లో భారత్ లో సుమారు 12 కోట్ల మంది చిన్న వ్యాపారులు ఉన్నారు. కానీ ఇందులో కేవలం 10 లక్షల మంది మాత్రమే వాట్సాప్ బిజినెస్ ను వాడుతున్నారు. దీని గురించి సరైన అవగాహన లేకపోవటం తో ఇంకా అధిక ప్రాచుర్యం లభించలేదు. కానీ ఆర్థిక మందగమనం వేధిస్తున్న ప్రస్తుత తరుణం లో స్మాల్ బిజినెస్ ఓనర్ల కు ఇది బాగా పనికొస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఖర్చు లేని వ్యాపార ప్రమోషన్ తో మన వాళ్ళు లబ్ది పొందాలని కోరుతున్నారు. మీరు కూడా ఒక చిరు వ్యాపారి అయితే, ఇంకెందుకు ఆలస్యం!
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications