For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రభుత్వ ఆశలపై ఆటో కంపెనీల నీళ్లు! EVలపై శ్రద్ధ అంతంతే

|

కాలుష్య నియంత్రణలో భాగంగా వచ్చే 5-10 ఏళ్లలో భారత్ దేశంలో డీజిల్ కార్లు, వాహనాల అమ్మకాలను తగ్గించి కేవలం పెట్రోలు, ఎలక్ట్రిక్ లేదా ప్రత్యమానయా ఇంధన వనరుల ద్వారా నడిచే వాహనాలనే అనుమతించాలని కేద్ర ప్రభుత్వం కంకణం కట్టుకొంది. ఈ మేరకి ఇటీవలి బడ్జెట్ లో కూడా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వినియోగదారులకు భారీ పన్ను మినహాంపైపులు ఇచ్చారు. అలాగే ఈ వాహనాలపై పన్ను రేటు కూడా కుదించారు. దీంతో, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల దూకుడు పెరుగుతుందని భావించారు. కానీ... ఈ దిశగా దేశంలో పెద్దగా మార్పులు ఏమి కనిపించటం లేదు. ఏదో ఒకటి, రెండు స్టార్టుప్ కంపెనీలు, అడపాదడపా కొంత పేరున్న కంపెనీలు ప్రైవేట్ టైప్ వాహనాలను మీడియాకు ప్రదర్శించి మళ్ళీ వాటి జోలికి వెళ్ళటం లేదు. దీనికి కూడా సరైన కారణాలు ఉన్నాయి. ఆటోమొబైల్ కంపెనీలు ప్రభుత్వం చెప్పగానే కొత్త మూడేళ్ళ ను మార్కెట్లో దించినంత మాత్రాన అమ్మకాలు పెరుగుతాయని గ్యారంటీ లేదు. ఇప్పటికి దాదాపు ఏడాది కాలంగా అంతకంతకూ అమ్మకాలు పడిపోతూ ఆగష్టు లో ఏకంగా 21 సంవత్సరాల కనిష్ఠానికి పతనం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఉన్న ఇల్లు సర్దు కొనేందుకే సమయం లేదు... ఇక కొత్త దాని గురించి ఎక్కడ ఆలోచించేది అన్నది ఆటోమొబైల్ కంపెనీల అభిప్రాయం.

మాంద్యం ఎఫెక్ట్: ప్రభుత్వరంగ కంపెనీల్లో పొదుపు చర్యలు షురూ!మాంద్యం ఎఫెక్ట్: ప్రభుత్వరంగ కంపెనీల్లో పొదుపు చర్యలు షురూ!

సగం కూడా ముందుకు రాలె...

సగం కూడా ముందుకు రాలె...

గత నాలుగు ఐదేళ్ళలో భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశ పెడతామని సుమారు 50కి పైగా కంపెనీలు ప్రకటించాయి. కానీ ఇందులూ దాదాపు సగం కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, లేదా అమ్మకాలను మొదలు పెట్టలేదు. అథెర్ ఎనర్జీ, హీరో ఎలక్ట్రిక్ వంటి కొన్ని కంపెనీలు మాత్రమే కొంత ఫరవాలేదు అనిపిస్తున్నాయి. మహీంద్రా అప్పట్లో రేవా ను మార్కెట్లోకి తెచ్చినా ఆశించిన ఆదరణ లేక పోయింది. ఆక్టివ్ గా ఉన్న కంపెనీలు కూడా ద్విచక్ర వాహనాలు పరిమితం అవుతున్నాయి. ఇప్పుడిప్పుడే పెద్ద కంపెనీలు తాము కూడా ఈ రంగంలోకి ప్రవేశిస్తామని చెబుతున్నా... ఆచరణ లోకి రావటానికి చాలా కాలం పడుతుందని అంచనా వేస్తున్నారు. చాలా కంపెనీలు ఢిల్లీ ఆటో ఎక్స్పో లో తమ మోడల్స్ ను ప్రదర్శించి ఊరుకున్నాయి.

లక్ష దాటడమే గగనం...

లక్ష దాటడమే గగనం...

భారత్ లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఆశించిన మేరకు జరగటం లేదు. 2018-19 ఆర్థిక సంవత్సరం లో దేశ వ్యాప్తం కేవలం 1 లక్ష వాహనాలు అమ్ముడైనట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అదే సమయంలో త్రిచక్ర వాహనాలు మాత్రం కొంత ఫరవాలేదనిపించాయి. వీటి అమ్మకాలు 5,00,000 మేరకు నమోదు టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. ఢిల్లీలో డీజిల్, పెట్రోలు ఆటోలపై నిషేధం వల్ల ఎలక్ట్రిక్ ఆటోల అమ్మకాలు కొంత అధికంగా జరిగినట్లు ఈటె పేర్కొంది. పరిస్థితి ఇలాగె కొనసాగితే, మరో 2-3 ఏళ్ళ వరకు ఎలెక్ట్రి వాహనాల అమ్మకాలు పెద్దగా పెరిగే సూచనలు కనిపించటం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.

చైనా పై ఆధారం...

చైనా పై ఆధారం...

మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేస్తున్నది స్టార్టుప్ కంపెనీలు, మరికొన్ని పెద్ద సంస్థలు మాత్రమే. మిగితా వన్నీ చైనా, టైవాన్ కంపెనీలతో జట్టు కట్టి అక్కడి మోడళ్లను కాస్త మార్పులతో ఇక్కడ విక్రయించే యోచన చేస్తున్నాయి. ఎందుకంటే, భారత మార్కెట్ ఈ తరహా వాహనాలను ఎంత వరకు ఆమోదిస్తుందో తెలియకుండా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడితే, నష్టాలే తప్ప ఇంకేం మిగలదని కంపెనీలు భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. పైగా, దేశంలో ఎలక్ట్రిక్ తయారీ రంగంలో పెద్దగా టెక్నాలజీ అందుబాటులో కూడా లేదు. అందుకే, తొలుత దిగుమతి చేసుకొని, మార్కెట్ రెస్పాన్స్ బట్టి తర్వాత ప్రొడక్షన్ కు వెళ్లాలని కంపెనీలు తలపిస్తున్నాయి.

మౌలిక సదుపాయాల లేమి...

మౌలిక సదుపాయాల లేమి...

భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేవు. ఎలక్ట్రిక్ వాహనాల్లో కీలకమైంది బాటరీ. ఈ బ్యాటరీల తయారీ భారీ ఖర్చుతో కూడుకొన్న పని. అదే సమయంలో ఇందుకు కావాల్సిన ముడి సరుకులు కూడా మన దేశంలో పెద్దగా లేవు. ఇందుకు మనం మళ్ళీ చైనాపైనో లేదా ఇతర దేశాలపైనో ఆధార పడాల్సిందే. అందుకే, తొందర పది ఏ కంపెనీ కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ఆఘమేఘాల మీద మార్కెట్లోకి తీసుకు రావటం లేదు. బాటరీ ఛార్జింగ్ యూనిట్లు కూడా పెట్టేందుకు ముందుకు రావటం లేదు. ఒకవేళ ప్రభుత్వం ఇందుకు పూనుకొని, చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తే మాత్రం పరిస్థితిలో కొంత మార్పు రావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

English summary

ప్రభుత్వ ఆశలపై ఆటో కంపెనీల నీళ్లు! EVలపై శ్రద్ధ అంతంతే | Are carmakers rolling out more electric vehicles?

It only took a decade for traditional automakers to take electric cars seriously and offer more than a smattering of test-the-water models.
Story first published: Saturday, September 14, 2019, 17:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X