For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్కెట్ అప్ & డౌన్, 52 వారాల గరిష్టానికి 9 స్టాక్స్

|

ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.40 నిమిషాలకు సెన్సెక్స్ 110 పాయింట్ల లాభం, నిఫ్టీ 26 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 37,214, నిఫ్టీ 11,008 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అయితే మధ్యాహ్నం సమయానికి తిరిగి స్వల్ప నష్టాల్లోకి జారిపోయింది. మధ్యాహ్నం గం.11.45 నిమిషాలకు 33.20 (0.089%) పెరిగి 37,071.08 పాయింట్ల వద్ద ఉంది. ఉదయం 11 వేల మార్క్ దాటిన నిఫ్టీ ఆ తర్వాత మధ్యాహ్నానికి 12.45 (0.11%) నష్టపోయి 10,970.35 వద్ద ట్రేడ్ అయింది. గురువారం మార్కెట్లు లాభాలతో ప్రారంభమైన నష్టాలతో ముగిసిన విషయం తెలిసిందే.

మధ్యాహ్నం సెషన్ సమయానికి టెలికం షేర్లు మిక్స్‌డ్‌గా ట్రేడ్ అయ్యాయి. జీటీఎల్ షేర్లు 9.27 శాతం, జీటీఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 5 శాతం, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 4.88 శాతం, టాటా టెలి సర్వీసెస్ 4.73 శాతం లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.

market update: Nifty struggles below 11,000, 9 stocks hit 52 week highs

వొడాఫోన్ ఐడియా 2.89 శాతం, తేజాస్ నెట్ వర్స్ 2.26 శాతం, మహానగర్ టెలిఫోన్ నిగమ్ 1.83 శాతం, భారతీ ఎయిర్ టెల్ 1.51 శాతం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.

నిఫ్టీలోని 50 స్టాక్స్‌లలో 19 లాభాల్లో, 31 నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. యస్ బ్యాంకు, టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎన్సీసీ, ఎల్ అండ్ టీ ఫిన్ హోల్డింగ్స్, పీఎఫ్‌సీ, సెయిల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.

ఎన్ఎస్ఈలో 9 స్టాక్స్ 52 వారాల గరిష్టానికి చేరుకుంది. గుజరాత్ స్టేట్ పెట్రోనెట్, ది ఫోనిక్స్ మిల్స్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్, సాంకో ఇండస్ట్రీస్, సంఘినిటా కెమికల్స్, వాడీలాల్ ఇండస్ట్రీస్, వాటర్ బేస్ కంపెనీల స్టాక్స్ 52 వారాల గరిష్టానికి చేరుకున్నాయి.

English summary

మార్కెట్ అప్ & డౌన్, 52 వారాల గరిష్టానికి 9 స్టాక్స్ | market update: Nifty struggles below 11,000, 9 stocks hit 52 week highs

Around 9 stocks rose to touch their 52-week highs on NSE in Friday's session. Among the stocks that touched their 52-week highs were Gujarat State Petronet, The Phoenix Mills, Prestige Estates Projects, Sanco Industries, Sanginita Chemicals, Vadilal Industries and Waterbase.
Story first published: Friday, September 13, 2019, 12:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X