For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్: సెప్టెంబర్ 26, 27 తేదీల్లో బ్యాంకుల సమ్మె

|

న్యూఢిల్లీ: ఇటీవల పలు బ్యాంకులను విలీనం చేస్తూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో 2017లో 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులు 12కు కుదించబడ్డాయి. ఈ బ్యాంకుల విలీనాన్ని బ్యాంకర్లు జీర్ణించుకోవడం లేదు. ప్రభుత్వరంగంలోని పది బ్యాంకులను నాలుగు పెద్ద బ్యాంకులుగా కన్సాలిడేట్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి నిరసగా సెప్టెంబర్ 26, సెప్టెంబర్ 27.. రెంజు రోజుల పాటు సమ్మె చేయనున్నట్లు బ్యాంకు అధికారులు వెల్లడించాయి.

నిర్మలా సీతారామన్‌కు షాకిచ్చిన మారుతీనిర్మలా సీతారామన్‌కు షాకిచ్చిన మారుతీ

బ్యాంక్ అధికారుల సంఘాలు అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య (AIBOC), అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం (AIBOA), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (ఇన్‌బాక్‌), బ్యాంకు అధికారుల జాతీయ సంఘటన (నోబో) ఈ మేరకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కు ఉమ్మడిగా నోటీసు ఇచ్చాయి.

Bank unions to go on two day strike from Sept 20 to protest mega merger

దేశంలోని పది పెద్ద బ్యాంకులను విలీనం చేసి నాలుగు బ్యాంకులుగా మార్చనున్నట్టు ప్రభుత్వం గత నెల 30వ తేదీన ప్రకటించింది. తమ డిమాండ్లకు మద్దతుగా నవంబరు రెండో వారం నుంచి నిరవధిక సమ్మెకు కూడా దిగుతామని కూడా యూనియన్ నాయకులు హెచ్చరిస్తున్నారు.

విలీన ప్రక్రియను నిరసించడంతో పాటు బ్యాంకుల్లో వారానికి ఐదు రోజులు పని దినాలను తక్షణం పూర్తిస్థాయిలో ప్రారంభించాలని, నగదు లావాదేవీల వ్యవధిని తగ్గించాలని, నియంత్రిత పని గంటలు అమలు చేయాలని కూడా బ్యాంకు సంఘాలు కోరుతున్నాయి. బ్యాంకుల విలీన ప్రక్రియను నిరసిస్తూ ఈ నెల 20వ తేదీన పార్లమెంటు భవనం ఎదుట ధర్నా చేయనున్నట్లు బ్యాంకు యూనియన్ల ఐక్య వేదిక ప్రకటించింది.

English summary

అలర్ట్: సెప్టెంబర్ 26, 27 తేదీల్లో బ్యాంకుల సమ్మె | Bank unions to go on two day strike from Sept 20 to protest mega merger

Four bank officers unions have called a two-day all India bank strike on September 26 and 27 protesting the government's move to merge public sector banks.
Story first published: Friday, September 13, 2019, 11:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X