నష్టాల్లో ముగిసిన షేర్ మార్కెట్లు: సెన్సెక్స్ 167 పాయింట్ల నష్టం
ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమై నష్టాలతో ముగిశాయి. ఉదయం సెన్సెక్స్ 150 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. కానీ సాయంత్రానికి సెన్సెక్స్ 167 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 11,000 మార్క్ దిగువన క్లోజ్ అయింది. మార్కెట్లు గత ఐదు రోజులుగా లాభాల్లో దూసుకెళ్తున్నాయి.
కీలక రంగాల షేర్లలో అమ్మకాలతో పాటు ప్రభుత్వం విడుదల చేసే గణాంకాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు గురువారం అప్రమత్తమయ్యారు. అలాగే, ఈ రోజు జరగబోయే యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు సమావేశం కూడా మన మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈ కారణంగా మార్కెట్ ఒడిదుడుకులకు లోనై చివరకు నష్టాల్లో ముగిసింది.

బ్యాంకింగ్, లోహ రంగాల షేర్ల కొనుగోళ్ల మద్దతుతో ఉదయం సూచీలు ఉత్సంహానే ప్రారంభమయ్యాయి. తొలుత కనిపించిన ఉత్సాహం ఆ తర్వాత ఎంతో సేపు నిలువలేదు. ఇన్వెస్టర్లు అప్రమత్తం కావడంతో మధ్యాహ్నానికి నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ ఈ రోజు 167 పాయింట్లు కోల్పోయి 37,104 వద్ద, నిఫ్టీ 55 పాయింట్లు నష్టపోయి 10,981 వద్ద క్లోజైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.34 వద్ద ఉంది.
ఐసీఐసీఐ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, సన్ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్ మహీంద్రా, ఎస్బీఐఎన్, ఓఎన్జీసీలు లాభాల్లో ముగియగా, ఎల్ అండ్ టీ, హెచ్‌సీఎల్ టెక్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, టీసీఎస్, ఐటీసీ, యస్ బ్యాంకు, మారుతీ, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ ముగించాయి.


Click it and Unblock the Notifications