For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లాభాల్లో స్టాక్ మార్కెట్లు, 175 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

|

ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.20 నిమిషాలకు సెన్సెక్స్ 52 పాయింట్లు లాభపడి 37,198 వద్ద, నిఫ్టీ 9 పాయింట్లు లాభపడి 11,012 వద్ద ట్రేడ్ అయింది. 561 కంపెనీల షేర్లు లాభాల్లో ఉండగా 263 కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగాయి. ఆ తర్వాత మధ్యాహ్నం గం.11.37 నిమిషాలకు సెన్సెక్స్ 174.60 (0.47%) పాయింట్లు పెరిగి 37,320.05 వద్ద, నిఫ్టీ 46.05 (0.42%) పెరిగి 11,049.10 వద్ద ట్రేడ్ అయింది. ఈ రోజు డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.67 వద్ద ఉంది.

ఉదయం నిఫ్టీలో లాభపడిన కంపెనీల్లో యస్ బ్యాంకు, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, వేదాంత, టాటా స్టీల్స్ ఉన్నాయి. నష్టపోయిన కంపెనీల్లో విప్రో, గెయిల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, కొటక్ మహీంద్రా బ్యాంక్ ఉన్నాయి.

మీ చేతికి వచ్చే శాలరీ పెరగొచ్చు, పెన్షన్‌కు ఏదో ఒకటిమీ చేతికి వచ్చే శాలరీ పెరగొచ్చు, పెన్షన్‌కు ఏదో ఒకటి

Market Update: Sensex rises over 150 points

ఆటో, బ్యాంకింగ్, ఎనర్జీ, ఇన్ఫ్రా, మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకులు సెక్టార్‌లు లాభపడగా, ఎఫ్ఎంసీజీ, ఐటీ సెక్టార్ మాత్రం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. యస్ బ్యాంకు షేర్లు 5 శాతం లాభపడగా, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ షేర్లు 3 శాతం, పవర్ మెక్ ప్రాజెక్టు షేర్లు 8 శాతం, సిండికేట్ బ్యాంకు షేర్లు 1.28 శాతం లాభపడ్డాయి.

English summary

లాభాల్లో స్టాక్ మార్కెట్లు, 175 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ | Market Update: Sensex rises over 150 points

Sensex rises 175 points, Nifty above 11,000. rupee trades at 71.84 against US dollar.
Story first published: Wednesday, September 11, 2019, 11:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X