ఓ వైపు మందగమనం ఆవహిస్తున్న తరుణం లో ఈ కామర్స్ కంపెనీలు ఉద్యోగార్ధులకు గుడ్ న్యూస్ అందిస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, క్వికర్ వంటి కంపెనీలు ఫ్రెషర్స్ ను రిక్రూట్ చేసుకొనే పనిలో పడ్డాయి. గతేడాది కంటే, ఈ సారి 40 % నుంచి 50% వరకు కొలువులు పెరగనున్నాయని ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. అయితే, ఈ జాబ్స్ మాత్రం కొత్త తరహా కోర్సులను అభ్యసించే వారినే వరిస్తున్నాయని ఆ పత్రిక పేర్కొంది. డేటా సైన్స్, ప్రోడక్ట్ మానేజ్మెంట్ , డిజైన్, ఫుల్ స్టాక్, ఐఓఎస్ , ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ రోల్స్ ఎక్కువ మందిని ఉద్యోగంలో చేర్చుకుంటున్నాయి. సింప్లి లెర్న్, ద్రూమ్ , టోర్క్ మోటార్స్ వంటి మరిన్ని స్టార్టుప్ కంపెనీలు సైతం ఈ జాబితా లో చేరిపోయాయి.

టాప్ స్కూల్స్ కె తోలి ప్రాధాన్యత...
ఈ కామర్స్ రంగంలో భారీ మార్పులు చేటుచేసుకొంటున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ పరంగా ఈ కంపెనీలు చాల అడ్వాన్స్ అవుతున్నాయి. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా సైన్స్, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్ అంశాలకు ప్రాధాన్యత పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ కామర్స్ దిగ్గజాలు, స్టార్టుప్ కంపెనీలు ఈ అంశాల్లో నైపుణ్యం సంపాదించిన వారిని నియమించుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. అయితే, దేశంలోని టాప్ 25 ఇంజనీరింగ్, మానేజ్మెంట్ స్కూల్స్ లో నుంచి ఫ్రెషర్స్ ను అధికంగా నియమించుకొంటున్నాయి. ఈ నియామకాల్లో చెప్పుకోదగ్గ వృద్ధి కనిపిస్తోందని, గతంలో కంటే కనీసం 50% వరకు స్టూడెంట్స్ అధిక ఆఫర్లు లభిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ కాలేజీలకు కూడా క్యాంపస్ ప్లేసెమెంట్స్ చాలా ముఖ్యం. స్టూడెంట్స్ అధిక ఆఫర్స్ లభిస్తేనే ఆ కాలేజీకి కొత్త అడ్మిషన్స్ ఎక్కువగా వస్తాయి. లేదంటే, సీట్లు నిండటం కష్టతరం అవుతుంది. ఈ తరుణంలో ఈ కామర్స్ దిగ్గజాలు, స్టార్టుప్ కంపెనీలు ఎక్కువ మందిని నియమించుకొంటుండటంతో కాలేజీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ఫ్లిప్కార్ట్ ముందంజ...
సరికొత్త కోర్సులను అభ్యసించే ఫ్రెషర్స్ ను నియమించుకొని విషయంలో అమెరికా రిటైల్ దిగ్గంజం వాల్మార్ట్ కొనుగోలు చేసిన ఫ్లిప్కార్ట్ చాల ముందంజలో ఉంటాలు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ కంపెనీ ఏకంగా నియామకాల్లో 40 % నుంచి 50% వరకు ఆఫర్స్ ను పెంచినట్లు ది ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. అదే సమయంలో సింప్లీ లెర్న్ 100% ఫ్రెషర్ హైరింగ్ పెంచిందని పేర్కొంది. ఆన్లైన్ ప్రకటనల సంస్థ క్వికర్ కూడా 27% నియామకాలను పెంచగా... అమెజాన్ కూడా ఈ సంఖ్యను భారీగా పెంచినట్లు సమాచారం. అయితే, ఈ సంస్థలు ఏవి కూడా అవి నియమించుకొని అభ్యర్థుల పూర్తి నంబర్స్ చెప్పక పోవడం గమనార్హం. దేశీయ ఈ కామర్స్ రంగంలో పోటీ అధికం ఐన నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంపెనీలు ఏ విషయంలో నైనా పోటీ పడుతున్నాయని, అది నియామకాలలో కూడా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఫ్రెషర్స్ మాత్రమే ఎందుకు?
ఇప్పటికే భారీ నష్టాల్లో ఉన్న ఈ కామర్స్ కంపెనీలకు ఉద్యోగుల వేతనాలు సైతం భారంగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అనుభవం ఉన్న వారిని నియమించుకొంటే వారికి అధిక శాలరీ ఆఫర్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ కంపెనీలు ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ వైపు పరుగులు పెడుతున్నాయని అంటున్నారు. అనుభవజ్ఞుడు పొందే వేతనంలో మూడో వంతులో కొత్త ఉద్యోగులు లభిస్తారు కాబట్టి... ఈ కామర్స్ దిగ్గజాలు, స్టార్టుప్ కంపెనీలు ఈ దిశగా తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయని పేర్కొంటున్నారు.

అందుకే లభిస్తున్నాయి...
ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ లో కేవలం వ్యయం ఒక్కటే కారణం కాదు. కంపెనీల కల్చర్ ను అతి తొందరగా అర్థం చేసుకొని, దానికి అనుగుణంగా కొత్త వారు పని చేసారని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా, కొత్త టెక్నాలజీ లో ఫ్రెషర్స్ కు శిక్షణ ఇవ్వడం కూడా తేలికేనని వారు అంటున్నారు. అదే అనుభవజ్ఞులు వారు ప్రస్తుతం పనిచేసే టెక్నాలజీ కాకుండా కొత్త దానికి అలవాటు పడటానికి ఇష్టపడరని, అదే అసలు కారణం కూడా అని చెబుతున్నారు. వీటన్నిటికీ మించిఫ్రెషర్స్ లో క్రియేటివిటీ కూడా అధికంగా ఉంటుంది కాబట్టి వారు కొత్త సోలుషన్స్ అందించే క్రమంలో కంపెనీలకు బాగా పనికి వస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా... ఫ్రెషర్స్ అధిక కొలువులు దక్కడం కునారిల్లుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు మేలు చేసేదే అని నిపులును సమర్థిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications