భారత్‌లో ఐఫోన్ ధరలు.. ఏ వేరియంట్ ఎంత అంటే?
న్యూఢిల్లీ: ఐఫోన్లను టిమ్ కుక్ భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి లాంచ్ చేశారు. ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్‌లను ఆవిష్కరించారు. తాజాగా, భారత్‌లో ఈ ఫోన్స్ ధరలను ఆపిల్ ప్రకటించింది.
భారత మార్కెట్లో ఐఫోన్ 11 ధర రూ.64,900 నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్ మూడు వేరియంట్స్‌లలో లభిస్తుంది. 64GB వేరియంట్ ధర రూ.64,900, 128GB వేరియంట్ ధర రూ.69,900, 256GB వేరియంట్ ధర రూ.79,900గా నిర్ణయించారు.

ఐఫోన్ 11 ప్రో 64GB ధర రూ.99,900, ఐఫోన్ 11 ప్రో 256GB ధర రూ.1,13,900, ఐఫోన్ 11 ప్రో 512GB ధర రూ.1,31,900గా నిర్ణయించారు.
ఐపోన్ 11 ప్రో మ్యాక్స్ 64GB ధర రూ.1,09,900, ఐపోన్ 11 ప్రో మ్యాక్స్ 256GB ధర రూ.1,23,900, ఐపోన్ 11 ప్రో మ్యాక్స్ 512GB ధర రూ.1,41,900గా నిర్ణయించారు. అమెరికా సహా ఇతర దేశాల్లో వీటి విక్రయాలు సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. భారత్‌లో సెప్టెంబర్ 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.


Click it and Unblock the Notifications