న్యూఢిల్లీ: గత కొద్ది నెలలుగా పెట్టుబడులు తరలిపోయిన గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETF) నిధుల రాక మళ్లీ ప్రారంభమైంది. గత ఆగస్ట్ నెలలో ఏకంగా రూ.145 కోట్ల ETF ఫండ్స్ వచ్చాయి. తొమ్మిది నెలల్లో ఇంత పెద్ద మొత్తంలో రావడం ఇదే మొదటిసారి. బంగారం ధరలు భారీగా పెరగడం, డాలర్ మారకంతో రూపాయి బలహీనం వంటి కారణాల వల్ల పెట్టుబడిదారులు ఇటువైపు మొగ్గు చూపుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంధ్యం భయాలు నెలకొన్నాయి. దీంతో భద్రత కలిగిన వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. దీంతో ఇటువైపు పెట్టుబడులు వస్తున్నాయి. ఈ అసెట్ క్లాస్‌లో పెట్టుబడులు పెరగడం తొమ్మిది నెలల్లో ఇదే మొదటిసారి. గత ఏడాది నవంబర్ నెలలో రూ.10 కోట్లు ఇన్వెస్ట్ చేశారు.

2012 డిసెంబర్ తర్వాత తిరిగి గోల్డ్ ETFలలోకి వచ్చిన నెలవారీ నికర పెట్టుబడుల్లో ఆగస్టులోనిదే అతిపెద్దది. ఆ ఏడాది డిసెంబర్ నెలలో రూ.474 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. గత నెలలో గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు నెల, వార్షిక ప్రాతిపదికన చూస్తే మంచి వృద్ధి నమోదు చేసింది. ఈ ఏడాది జూలైలో ఇన్వెస్టర్లు రూ.17.66 కోట్లు, గత ఏడాది (2018) ఆగస్టులో రూ.45 కోట్లు వెనక్కి తీసుకున్నారు.
అసోసియేషన్ ఆఫ్ మ్యుచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) డేటా ప్రకారం రూ.145.29 కోట్లు గోల్డ్ లింక్డ్ ఈటీఎఫ్‌లలోకి గత నెలలో ఇన్వెస్ట్ చేశారు. అక్టోబర్ 2016లో గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి రూ.20 కోట్లు వచ్చాయి. అంతకుముందు మే 3, 2013లో రూ.5 కోట్లు వచ్చాయి.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు, కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications