బీజింగ్: చైనీస్ ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకులు, కంపెనీ చైర్మన్ జాక్ మా తన పదవి నుంచి తప్పుకున్నారు. మంగళవారం (సెప్టెంబర్ 10) తన 55వ పుట్టిన రోజున ఆయన రిటైర్మెంట్ తీసుకున్నారు. చైర్మన్ పదవిని వీడినప్పటికీ అలీబాబా భాగస్వామ్య గ్రూప్‌లో సభ్యుడిగా ఉంటారు. కంపెనీ బోర్డ్ ఆఫ్ డెరెక్టర్లలో మెజార్టీ సభ్యులను నామినేట్ చేసే హక్కు ఈ గ్రూప్‌కు ఉంది.
గత ఏడాది తన పుట్టిన రోజు సమయంలోనే రిటైర్మెంట్ తీసుకుంటానని జాక్ మా ప్రకటించారు. కానీ కంపెనీ మాత్రం ఆయనను మరో ఏడాది పాటు కొనసాగాలని కోరింది. దీంతో ఆయన తన 55వ ఏడు వరకు కొనసాగారు. ఇప్పుడు ఆ హోదా నుంచి తప్పుకున్నారు.

జాక్ మా ఇంగ్లీష్ టీచర్. అతను 1999లో ఈ-కామర్స్ రంగంలోకి అడుగు పెట్టారు. అలీబాబాను స్థాపించారు. తక్కువ కాలంలో బిలియన్ డాలర్ల కంపెనీకా అవతరించింది. 2013లో సీఈవో పదవి నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు చైర్మన్ పదవికి కూడా గుడ్ బై చెప్పారు. ప్రపంచంలోని కుబేరుల్లో ఒకరైన జాక్‌మా సంపాదన 41.8 బిలియన్ డాలర్ల వరకు ఉంది.
జాక్ మా 2016లో ఆసియా అత్యంత ధనికుడిగా నిలిచారు. దిలయన్ వాండా గ్రూప్ చైర్మన్ వాంగ్ జియాన్‌లిన్ తోసిరాజి జాక్ మా ముందుకొచ్చారు. ప్రస్తుతం ఆసియాలో అత్యంత సంపాదనపరుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ రూ.47.4 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!



Click it and Unblock the Notifications