ముంబై: ప్రముఖ ఆడిటింగ్ సంస్థ ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్ (PWC) ఇండియాకు ఊరట లభించింది. రూ.7,800 కోట్ల సత్యం కంప్యూటర్స్ స్కాంలో పాత్ర ఉందని నిర్ధారిస్తూ ఇతర లిస్టెడ్ కంపెనీల ఆడిటింగ్ బాధ్యతలను రెండేళ్ళపాటు నిర్వర్తించవద్దని PWCపై 2018 జనవరిలో సెబి నిషేధం విదించింది. దీనిపై అప్పీల్ చేయగా సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (శాట్) దీనిని కొట్టివేస్తూ PWCకి ఊరటనిచ్చింది. అదే సమయంలో PWC నుంచి రూ.13 కోట్ల రుసుము వసూలు చేయడానికి శాట్ అంగీకారం తెలిపింది.
'సత్యం' రామలింగరాజు ప్రమోటర్‌గా ఉన్న సత్యం కంప్యూటర్స్ స్కాం 2009 జనవరి 8న వెలుగు చూసింది. కంప్యూటర్స్ ఖాతాల్లో అక్రమాలు ఉన్నాయని, కొంతకాలంగా రూ.5,004 కోట్ల మేర వాస్తవాలను దాచిపెట్టినట్లు ఆ సంస్థ నాటి చైర్మన్ రామలింగరాజు స్వయంగా బయటపెట్టారు. ఈ కేసులో ఆడిటింగ్ కంపెనీ పాత్ర ఉందని సెబి తన దర్యాఫ్తులో తేల్చింది.
దీంతో PWCపై నిషేధం విధించింది. దీనిని PWC శాట్‌లో సవాల్ చేసింది. IL&FS స్కాంలో రెండు అతిపెద్ద ఆడిటింగ్ సంస్థలైన డెలాయిట్, బీఎస్ఆర్ కంపెనీల పాత్రపై నియంత్రణ సంస్థలు దర్యాఫ్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శాట్ ఈ తరహా ఆదేశాలు జారీ చేసింది. కాగా శాట్ ఆదేశాలపై సెబి సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశాలు లేకపోలేదు.

ప్రపంచంలోని నాలుగు అతిపెద్ద ఆడిటింగ్ సంస్థల్లో PWC ఒకటి. దీనిపై దేశీయ ఆడిటర్ల సంఘం ఐసీఏఐకు మాత్రమే చర్యలు తీసుకునే అధికారం ఉందని శాట్ తెలిపింది. ఆఢిటింగ్‌లో నిర్లక్ష్యాన్ని కారణంగా చూపుతూ, మోసానికి పాల్పడ్డారని రుజువు చేయలేమని శాట్ పేర్కొంది. ఆడిట్, ఆఢిటింగ్ సేవల్లో నాణ్యతను పరిశీలించే అధికారం సెబికి లేదని, ఇన్వెస్టర్ల ప్రయోజనాలు పరిరక్షించడమే సెబి విధి అని పేర్కొంది.
ఇన్వెస్టర్లకు హానీ కలిగే నేరం జరగకుండా, జరిగాక పరిష్కారాలను మాత్రమే సెబి సూచించగలదని, కానీ PWCకి సంబంధించి ఇచ్చిన ఆదేశాలు శిక్షాత్మకంగా ఉన్నాయని శాట్ పేర్కొంది. సత్యం స్కాంలో PWC సంస్థలు భాగస్వాములైనట్లుగా రుజువులు లేవని, ఆడిటింగ్ సంస్థ డిటెక్టివ్‌గా వ్యవహరించాల్సిన పని లేదని తెలిపింది.
ఒకవేళ పరిశీలనా సంస్థ మాత్రమే తమ విధుల్ని నిర్వర్తించలేదని భావిస్తే రెండు సంస్థల తప్పిదం అవుతుందని, అంతేకాదని పది సంస్థలపై వేటు తగదని శాట్ పేర్కొంది. విధులను ఉల్లంఘించినందుకు మాత్రం రూ.13 కోట్లను వడ్డీతో సహా PWC నుంచి వసూలు చేయాలని పేర్కొంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications