ఏంజెల్స్‌గా మారుతున్న స్టార్టప్ ఫౌండర్లు

భారత దేశం లో ప్రస్తుతం స్టార్టప్ కంపెనీల హవా నడుస్తోంది. గత పదేళ్లలో ఇండియా లో చాలా స్టార్టప్ కంపెనీలు పురుడు పోసుకున్నాయి. కొన్ని అంతకంతకూ పెరుగుతూ బిలియన్ డాలర్ కంపెనీలుగా మారితే... మరికొన్ని మొగ్గ దశలోనే తనువూ చాలించాయి. ప్రస్తుతం భారత దేశం స్టార్టుప్ కంపెనీల సంఖ్య పరంగా ప్రపంచంలోనే మూడో స్థానం లో ఉంది. సక్సెస్ కంటే ఫెయిల్యూర్ అధికంగా ఉండే స్టార్టప్ జర్నీ అంటే ఇప్పటి యువత పెద్దగా భయపడటం లేదు. అనుకున్నది సాధించేందుకు రిస్క్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మార్పు వల్లనే మన దేశంలో వేళా కొద్దీ కొత్త స్టార్టుప్ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి.

ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పటికే విజయవంతం ఐన స్టార్టప్ కంపెనీల ఫౌండర్లు... తాజాగా ఏంజెల్స్ అవతారం ఎత్తుతున్నారు. ఒకప్పుడు రిస్క్ తీసుకొని, స్టార్టప్ కంపెనీని విజయపథంలో నడిపించిన వారే... ప్రస్తుతం తమ లాగా పట్టుదలతో ఉన్న స్టార్టప్ ఫౌండర్లకు ఆర్థికంగా చేయూత నిచ్చేందుకు వెనుకాడటం లేదు. దీంతో ఒకప్పటి ఫౌండర్లు ఇప్పుడు పెట్టుబడిదారులుగా కొత్త అవతారం ఎత్తుతున్నారు.

దిగ్గజాలతో మొదలు ...

దిగ్గజాలతో మొదలు ...

స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా సహా... ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకులు నందన్ నీలేకని, మోహన్దాస్ పై, ఎం ఆర్ నారాయణ మూర్తి, విప్రో అధిపతి అజీమ్ ప్రేమజీ వంటి దిగ్గజాలతో మొదలైంది. వీరంతా... నయా భారత్ ఆశలను, ఆకాంక్షలను అర్థం చేసుకొని, కొత్త తరహా బిజినెస్ లకు ప్రాణం పొసే ప్రయత్నాల్లో ఉన్న యువ ఫౌండర్లకు పెట్టుబడి అందించి వెన్ను తట్టి ప్రోత్సహించారు. దాని ఫలితాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. విజయవంతం అయిన స్టార్టుప్ కంపెనీలు భారత్ లో అధిక సంఖ్య లో ఉండేందుకు వీరు మార్గనిర్దేశం చేశారు. ప్రస్తుతం వారి అడుగుజాడల్లో కొత్త తరం యువ ఫౌండర్లు ముందుకు వస్తున్నారు.

ఒకటికి మించి....

ఒకటికి మించి....

ఫ్లిప్కార్ట్ వ్యవస్థాపకులు సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ సహా అనేక మంది విజయవంతమైన స్టార్టుప్ ఫౌండర్లు ప్రస్తుతం ఏంజెల్ ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటలిస్టులుగా మారిపోయారు. ఏదో ఒకటి రెండు పెట్టుబడులతో సరిపెట్టుకోవటం లేదు. ఒక పోర్ట్ఫోలియో ను సృష్టిస్తున్నారు. సుమారు 18 కంపెనీల్లో పెట్టుబడి పెట్టి సచిన్ బన్సల్ ఈ విషయం లో దూసుకు పోతున్నారు. బిన్నీ బన్సల్ కూడా ఐదారు ఇన్వెస్ట్మెంట్లు చేసారు. ఫ్రీఛార్జి అనే కంపెనీని 400 మిలియన్ డాలర్లకు విక్రయించిన కునాల్ షా కూడా తాజాగా స్టార్టుప్ కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. క్రెడ్ అనే కంపెనీలో పెట్టుబడి పెట్టారు. పే టీ ఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ కూడా రూట్స్ వెంచర్స్ అనే పెట్టుబడి సంస్థలో భాగస్వామిగా చేరారు. అలాగే ఆయన కొన్ని స్టార్టుప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు.

ముందు వరుసలో తెలుగు తేజం...

ముందు వరుసలో తెలుగు తేజం...

ఈ విషయం లో మన తెలుగు ఫౌండర్లు కూడా ముందు వరుసలోనే ఉన్నారు. రెడ్ బస్సు అనే కంపెనీని స్థాపించి భారత్లో బస్సు టిక్కెట్లను ఆన్లైన్ లో బుక్ చేసుకునే అవకాశం కల్పించిన తొలితరం స్టార్టప్ ఫౌండర్ ... ఫణింద్ర సామా. తెలుగు వాడు ఐన ఫణింద్ర... బెంగళూరు కేంద్రంగా స్థాపించిన రెడ్ బస్సు అనే కంపెనీని సుమారు రూ 600 కోట్లకు విక్రయించారు. ప్రస్తుతం ఆయన సామా కాపిటల్ పేరుతో పూర్తి స్థాయి వెంచర్ కాపిటల్ సంస్థను నడుపుతున్నారు. అనేక కంపెనీల్లో ఇప్పటికే పెట్టుబడులు పెట్టి దూసుకు పోతున్నారు. మానితే మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

సెలెబ్రిటీ స్టేటస్...

సెలెబ్రిటీ స్టేటస్...

మన దేశంలో వ్యాపార వేత్తలకు ఒకప్పుడు పెద్దగా గుర్తింపు ఉండేది కాదు. కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకొంటున్నాయి. ప్రధాని నుంచి సర్పంచ్ వరకు రాజకీయ నాయకులు స్టార్టుప్ కంపెనీల ప్రాధాన్యతను గుర్తించారు. దేశంలో ఉపాధి కల్పనకు స్టార్టుప్ లను మించిన మార్గం లేదని, అందుకే వాటికి అన్ని రకాల ప్రాతఃకాల అందించాలనే సంకల్పంతో ఉన్నారు. అంతే కాకుండా... మీడియా కూడా స్టార్టప్ కంపెనీల సక్సెస్ స్టోరీస్ కు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఫౌండర్ల విజయ గాథలను పతాక శీర్షికలుగా ప్రచురిస్తున్నాయి. అందుకే, సామాన్య పౌరులకు కూడా స్టార్టుప్ కంపెనీల ఫౌండర్ల సేవలను గుర్తిస్తున్నారు. అలాగే వారిని సెలెబ్రిటీలుగా పరిగణిస్తున్నారు. ఇటీవలి కాలంలో 5కే రన్, 10 కే రన్ వంటి కార్యక్రమాలకు సినీ తారలకంటే స్టార్టుప్ కంపెనీల ఫౌండర్లే ఎక్కువగా ముఖ్య అతిథిలుగా హాజరు అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+