SBI గుడ్‌న్యూస్: వడ్డీ రేట్లు మరింత తగ్గాయి, హోంలోన్ ఇంకా తక్కువ

ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రుణగ్రహీతలకు మరోసారి శుభవార్త చెప్పింది. ఈ బ్యాంకు నుంచి హోమ్ లోన్, వెహికిల్ లోన్ వంటివి తీసుకునే వారికి ఎస్బీఐ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. అన్ని కాల పరిమితుల రుణాలపై వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. ఈ మేరకు సవరించిన రుణ రేట్లు సెప్టెంబర్ 10 (మంగళవారం) నుంచి అమలులోకి వస్తున్నట్లు తెలిపింది. దీని వల్ల గృహ, ఆటో రుణాలు మరింత చౌక కానున్నాయి.

టర్మ్ డిపాజిట్స్ పైన 20-25 బేసిస్ పాయింట్స్ తగ్గుదల

టర్మ్ డిపాజిట్స్ పైన 20-25 బేసిస్ పాయింట్స్ తగ్గుదల

ఎస్బీఐ తన టర్మ్ డిపాజిట్స్ పైన 20-25 బేసిస్ పాయింట్ల మధ్య తగ్గించింది. బల్క్ టర్మ్ డిపాజిట్ల పైన వడ్డీ రేటును 10-20 బేసిస్ పాయింట్స్ మధ్య తగ్గించింది. ఏడాది నుంచి రెండేళ్ల కాలపరిమితి డిపాజిట్స్ పైన 6.70 శాతం ఉన్న వడ్డీ రేటు 6.50 శాతానికి తగ్గింది. డిపాజిట్స్ పైన వడ్డీ రేట్లు తగ్గించడం పదిహేను రోజుల్లో ఇది రెండోసారి. చివరిసారి ఆగస్ట్ 26వ తేదీన 10 నుంచి 50 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. ఈ మేరకు సోమవారం నాడు ఎస్బీఐ ప్రకటన చేసింది. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి అన్ని కాల పరిమితులలో వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్స్ తగ్గిస్తున్నామని పేర్కొంది.

ఎంసీఎల్ఆర్ 8.15కు

ఎంసీఎల్ఆర్ 8.15కు

ఎస్బీఐ రేట్ కట్ నేపథ్యంలో MCLR 8.25 బేసిస్ పాయింట్స్ నుంచి 8.15 పాయింట్లకు తగ్గింది. ఎస్బీఐ MCLR రేటును తగ్గించడం ఈ ఏడాదిలో ఇది వరుసగా ఐదో సారి. ఆర్బీఐ 110 ఈ ఏడాది 110 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. ఎస్బీఐ అంతకుముందు రేట్ కట్ ఆగస్ట్ 10వ తేదీన 15 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. ఇప్పుడు మరో 10 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. ఆర్బీఐ రెపో రేటు ప్రయోజనాలను ఎస్బీఐ సాధ్యమైనంతగా కస్టమర్లకు అందించేందుకు కృషి చేస్తోంది.

మొత్తంగా 45 బేసిస్ పాయింట్ల మేర తగ్గుదల

మొత్తంగా 45 బేసిస్ పాయింట్ల మేర తగ్గుదల

రెపో రేటు ప్రయోజనాలను ఎస్బీఐ కస్టమర్లకు అందిస్తుండటంతో హోమ్ లోన్, వెహికిల్స్ మరింత చౌక అవుతున్నాయి. ఏప్రిల్ 10 నుంచి ఎస్బీఐ ఇప్పటి వరకు 45 బేసిస్ పాయింట్ల మేర రుణాలపై వడ్డీ రేట్లు తగ్గాయి.

ఎస్బీఐ MCLR రేట్లు

ఎస్బీఐ MCLR రేట్లు

- ఓవర్ నైట్ - 7.9 శాతం నుంచి 7.8 శాతానికి తగ్గుదల

- వన్ మంత్ - 7.9 శాతం నుంచి 7.8 శాతానికి తగ్గుదల

- మూడు నెలలు - 7.95 శాతం నుంచి 7.85 శాతానికి తగ్గుదల

- ఆరు నెలలు - 8.1 శాతం నుంచి 8 శాతానికి తగ్గుదల

- వన్ ఇయర్ - 8.25 శాతం నుంచి 8.15 శాతానికి తగ్గుదల

- రెండేళ్లు - 8.35 శాతం నుంచి 8.25 శాతానికి తగ్గుదల

- మూడేళ్లు - 8.45 శాతం నుంచి 8.35 శాతానికి తగ్గుదల

ఎస్బీఐ FD రేట్లు

ఎస్బీఐ FD రేట్లు

- 7 రోజుల నుంచి 45 రోజులకు 4.50 శాతం ఉండగా అంతే ఉండనుంది.

- 46 రోజుల నుంచి 179 రోజుల వరకు 5.50 శాతం ఉండగా అదే ఉండనుంది.

- 180 రోజుల నుంచి 210 రోజులకు 6.00 శాతం నుంచి 5.80 శాతానికి తగ్గింది.

- 211 రోజుల నుంచి ఏడాది లోపు 6.00 శాతం నుంచి 5.80 శాతానికి తగ్గింది.

- ఏడాది నుంచి రెండేళ్ల వరకు 6.70 శాతం నుంచి 6.50 శాతానికి తగ్గింది.

- 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల వరకు 6.50 శాతం నుంచి 5.50 శాతానికి తగ్గింది.

- మూడేళ్ల నుంచి 5 ఏళ్ల వరకు 6.25 శాతం ఉండగా అంతే ఉంటుంది.

- ఐదేళ్ల నుంచి 10 ఏళ్ల వరకు 6.25 శాతం ఉండగా అంతే ఉండనుంది.

సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేట్లు...

సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేట్లు...

- 7 రోజుల నుంచి 45 రోజులకు 5.00 శాతం ఉండగా అంతే ఉండనుంది.

- 46 రోజుల నుంచి 179 రోజుల వరకు 6.00 శాతం ఉండగా అదే ఉండనుంది.

- 180 రోజుల నుంచి 210 రోజులకు 6.50 శాతం నుంచి 6.30 శాతానికి తగ్గింది.

- 211 రోజుల నుంచి ఏడాది లోపు 6.50 శాతం నుంచి 6.30 శాతానికి తగ్గింది.

- ఏడాది నుంచి రెండేళ్ల వరకు 7.20 శాతం నుంచి 7.00 శాతానికి తగ్గింది.

- 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల వరకు 7.00 శాతం నుంచి 6.75 శాతానికి తగ్గింది.

- మూడేళ్ల నుంచి 5 ఏళ్ల వరకు 6.75 శాతం ఉండగా అంతే ఉంటుంది.

- ఐదేళ్ల నుంచి 10 ఏళ్ల వరకు 6.75 శాతం ఉండగా అంతే ఉండనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+